Categories: TOP STORIES

అక్ర‌మ నిర్మాణాల‌పై.. ఒక చోట కరుణ.. మరో చోట కూల్చివేత?

భూ కబ్జాల వ్యవహారంలో రేవంత్ సర్కారు చేస్తున్న విన్యాసాలు ఒకింత వివాదం అవుతున్నాయి. ఆయ‌న కొందరిపై ప్రేమ చూపిస్తూ.. మరికొందరిపై కాఠిన్యం చూపిస్తున్నారనే విషయం రియల్ వర్గాల్లో ప్రధానాంశంగా మారింది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి విద్యా సంస్థల ముసుగులో చేసిన చెరువు కబ్జాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా కూల్చివేతల్ని మొదలుపెట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు సీఎం రేవంత్తో రాయబేరాలకు దిగారు. ఇదంతా రాజకీయ కోణం ఓవైపు ఉంటే.. ఏకంగా 111 జీవోలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న డ్రీమ్ వ్యాలీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.

డ్రీమ్ వ్యాలీ అనే సంస్థ ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలో డ్రీమ్ వ్యాలీ రిసార్టును నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. 111 జీవో ప్రాంతంలో అక్రమంగా క‌ట్టిన రిసార్టు ద్వారా ఆదాయం గ‌ణ‌నీయంగా గిట్టుబాటు అవుతుండ‌టంతో.. ఈ కంపెనీ ఒక అడుగు ముందుకేసింది. అప్పటికే ప్రభుత్వ పెద్దలతో అండ పెంచుకోవడంతో మరో భారీ ప్లాన్కు దిగింది. రిసార్టు వెన‌క భాగంలో ఇమాజిన్ అనే హై ఎండ్ ల‌గ్జరీ విల్లా క‌మ్యూనిటిని అక్రమంగా నిర్మిస్తోంది. ఇమాజిన్ విల్లా క‌మ్యూనిటీ బ్రోచ‌ర్‌ను చూస్తే ఎవ‌రికైనా మతిపోవాల్సిందే. ఇందులో ఒక్కో విల్లాను సుమారు ప‌దిహేను వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తోంది. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.15 వేలుగా ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. అంటే, ధ‌ర దాదాపు రూ. 22.50 కోట్ల దాకా ఉంటుంది. ఇప్పటికే దీనిపై హెచ్ఎండీఏ దగ్గర పూర్తి డేటా కూడా ఉంది. అనుమతి లేకుండా నిషేదిత ప్రాంతంలో నిర్మించడంపై నివేదిక కూడా ఇచ్చారు.

మరేమైంది?
చెరువును కబ్జా చేసిన నిర్మించిన విద్యా సంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న డ్రీమ్ విల్లాస్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. సదరు నిర్మాణ సంస్థ యజమానికి గత ప్రభుత్వంలోనే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే.. రాజకీయ కోణంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తున్న రేవంత్ సర్కారు.. 111 జీవోను అతిక్రమించి నిర్మిస్తున్న విల్లాలపై మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఒకవేళ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కాంగ్రెస్లో చేరితే.. ఆక్రమణల కూల్చివేతలకు బ్రేక్ పడినట్టే. ఇదే సమయంలో డ్రీమ్ విల్లాస్ అధినేతతో కూడా ఇంకొంత బంధం బలపడితే.. ఇక్కడ కూడా విల్లాల్లో ‘సంతోషం’గా గృహ ప్రవేశం చేసుకోవచ్చన్న మాట. కాంగ్రెస్ రాజకీయ కోణం.. ఆర్థిక కోణాలు కొంతమందికి కలిసి వస్తున్నట్టే లెక్క. ఒక‌వేళ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌గానే అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను అర్థాంత‌రంగా నిలిపివేస్తే.. రేవంత్ రెడ్డి వ్య‌క్తిగ‌తంగా అప్ర‌తిష్ఠ‌పాల‌య్యే ప్ర‌మాద‌ముంది,

This website uses cookies.