అది కేవలం బడా బాబులకే సాధ్యమవుతుంది.. తమ లాంటి వారు కొనగలరా? అన్నది మీ సందేహమా?
అలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దు. ఇక నుంచి మీరూ ఎలాంటి బడా వాణిజ్య సముదాయాల్లోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం మీ వద్ద కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు. రీట్, ఇన్విట్ కనీస దరఖాస్తు విలువను తగ్గిస్తూ సెబీ జులై 30న సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రీట్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు.. కనీస దరఖాస్తు విలువను రూ.50 వేల బదులు రూ.10వేలు చేసింది. ఇన్విట్లలో మదుపు చేసేవారు లక్ష రూపాయల బదులు పదిహేను వేలుగా నిర్ణయించింది.
అంటే, రీట్లలో మదుపు చేయాలనుకుంటే.. ఎన్ని పదివేలు అయినా మీరు పెట్టుబడి పెట్టవచ్చన్నమాట. గతంలో అయితే కనీసం వంద యూనిట్లు కొనాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు మీ వద్ద ఎంత సొమ్ముంటే అన్ని యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.
This website uses cookies.