- అన్వితా గ్రూప్ నుంచి పార్క్ సైడ్ విల్లాలు
- ప్రతి విల్లాకు వెనుక వైపు ప్రత్యేక పార్క్
- మేడ్చల్ మండలం రావల్కోలేలో కొత్త ప్రాజెక్టు
- పిల్లలు గాడ్జెట్లు వదిలి పార్కు లో ఆడుకునేలా డిజైన్
ఏ గేటెడ్ కమ్యూనిటీలో చూసిన మొత్తం అందరికీ కలిపి ఒకటే పార్క్ ఉంటుంది. కానీ అన్వితా గ్రూప్ కొత్త ప్రాజెక్టులో ప్రతి ఇంటికీ ఓ పార్క్ ఉంటుంది. ఐడియా అదిరింది కదూ? రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోలేలో అన్వితా పార్క్ సైడ్ విల్లాస్ పేరుతో అన్వితా గ్రూప్ కొత్త ప్రాజెక్టు లాంచ్ చేసింది. దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ప్రతి ఇంటికీ వెనుకవైపు ఓ పార్క్ ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఐడియాతో ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు.
గాడ్జెట్లకే అతుక్కుపోతున్న పిల్లలను వాటిని వదిలి గార్డెన్ లోకి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రాజెక్టు డిజైన్ చేశామని అన్వితా గ్రూప్ ఎండీ అచ్యుతరావు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్టాడారు. రెండున్నర నుంచి మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ప్రతి ఇంటికీ ఓ పార్క్ తోపాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో విల్లాలు నిర్మిస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్ అంటే వెస్ట్ సైడ్ డెవలప్ మెంట్ మాత్రమే కాదని.. అన్ని వైపులా అవుతోందని పేర్కొన్నారు.