హైదరాబాద్ రియల్ రంగం గచ్చిబౌలి తర్వాత కోకాపేట్, కొల్లూరు, ఈదులనాగులపల్లికి చేరింది. అక్కడ కూడా ధరలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరగడంతో.. కొనుగోలుదారుల దృష్టి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 చుట్టుపక్కల ప్రాంతాలైన పటాన్ చెరు, ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూర్ వంటి ప్రాంతాల మీద పడింది. ఈ క్రమంలో పలువురు డెవలపర్ల అందుబాటు ధరలో లగ్జరీ ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు.
గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనలేని వారంతా ప్రస్తుతం పటాన్చెరు వైపు దృష్టి సారిస్తున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేయాలనుకునే వారితోపాటు స్థిర నివాసాన్ని కోరుకునేవారు ఇక్కడి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో వీరికి అందుబాటులో ఉన్న ప్రాజెక్టులేమిటి? వాటి ప్రత్యేకతలేమిటో ఒకసారి చూసేద్దామా..
పేరు | ఎక్కడ | విస్తీర్ణం | సంఖ్య | బిల్టప్ ఏరియా | ధర | పూర్తి? |
రాంకీ వన్ సింఫనీ | పటాన్ చెరు | 13.8 | 1500 | 1065-1585 | 5299 | 2024 డిసెంబరు |
శివంతా గార్డెనియా | ఇస్నాపూర్ | 18 | 1100 | 895- 1030 | 3700 | 2022 డిసెంబరు |
భవాని హై నెస్ట్ | ఇస్నాపూర్ | 1.19 | 160 12 | 1273- 1428 | 3800 | 2023 డిసెంబరు |
ఏపీఆర్ హైయేరియా | పటాన్ చెరు | 7 | 730 | 1150- 1700 | 4299 | 2024 జూన్ |
అరితా జ్యుయెల్ కౌంటీ | పటాన్ చెరు | 5.56 | 792 | 1234- 1992 | 4299 | 2024 జూన్ |
ఎంపీహెచ్ ఆస్పిరా వండర్ ఇస్నాపూర్ | ఇస్నాపూర్ – | 5 | 300 | 542- 1173 | 3600 | రెడీ టు మూవ్ |
సిగ్నేచర్ ఎవెన్యూస్ ఇస్నాపూర్ | ఇస్నాపూర్ | 340 | 1210 | 3800 | 2023 జూన్ |
* ఈ ధరలు అవగాహన కోసమే. తుది రేటుకు బిల్డర్ని సంప్రదించండి.