poulomi avante poulomi avante

ప్ర‌తి క‌మ్యూనిటీలో చీడ పురుగులు!  

కింగ్ జాన్సన్ కొయ్యడ : ప్ర‌తి అపార్టుమెంట్‌లో కొందరు వ్య‌క్తులుంటారు.. మేనేజింగ్ క‌మిటీ ఎంత మంచి ప‌ని చేసినా, అందులో త‌ప్పులు వెతికే ప్ర‌య‌త్నం చేస్తారు. సాటి నివాసితుల్లో విష‌బీజాల్ని నాటుతుంటారు. నిర్వ‌హ‌ణ సంఘం గురించి వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటారు. క‌మిటీ స‌భ్యులు ముందు ఒక మాట‌.. వెన‌క మ‌రో మాట మాట్లాడ‌తారు. పోనీ వీరేమైనా క‌మిటీ రోజువారి ప‌నుల్లో సాయం చేస్తారా? అంటే అదీ లేదు. ఇలాంటి వారి వ‌ల్ల క‌మ్యూనిటీ రెండు లేదా మూడు వ‌ర్గాలుగా చీలిపోయే ప్ర‌మాద‌ముంది. హైద‌రాబాద్‌లోని అధిక శాతం గేటెడ్ క‌మ్యూనిటీల్లో ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. కాబ‌ట్టి, ఇలాంటి వారిని ముందే గుర్తించి.. ప‌క్క‌న పెట్టేయ‌డం ఉత్త‌మం.

కొన్ని గేటెడ్ క‌మ్యూనిటీల‌ను చూస్తే ముచ్చటేస్తుంది. ఎప్పుడు చూసినా నిత్యనూతనంగా కళకళలాడుతాయి. నిర్వ‌హ‌ణ విష‌యంలో మెరుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంది. మరి కొన్నేమో అందవికారంగా దర్శనమిస్తాయి. నిర్వాహణకు సంబంధించి నిర్లక్ష్యం వహించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఆయా ఫ్లాట్ల విలువ గణనీయంగా పడిపోతుంది. అలా కాకూడదంటే, నివాసితులంతా వ్యక్తిగత వివాదాల్ని పక్కనపెట్టి… అహంభావాలకు తావివ్వకుండా.. ఒకే మాట మీద నిలబడి అపార్టుమెంటును సక్రమంగా నిర్వహించడం మీద దృష్టి సారించాలి. ఇందుకోసం పటిష్టమైన నియమ నిబంధనల్ని(బైలాస్) రూపొందించుకోవాలి.

మినీ భార‌త్‌..

నగరంలో నిర్మాణం పూర్తైన లగ్జరీ ఫ్లాట్లు, ఆకాశహర్మ్యాలు, ఆధునిక విల్లాలు…ఇందులో నివసించే ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. ఒక్కో ప్రాంతం.. విద్యాబుద్ధులు, వేష బాషలు, ఆలోచన విధానం, నిర్ణయం తీసుకునే మనస్తత్వం.. ఇలా ప్రతి అంశంలోనూ తేడా స్పష్టంగా కన్పిస్తుంది. ఒక్కో నిర్మాణం మినీ భారత్ ను తలపిస్తున్న నేపథ్యంలో.. క‌మ్యూనిటీ అభివృద్ధి కోసం క‌లిసిక‌ట్టుగా ప్ర‌య‌త్నించాలి. ఎవరికి వారే తమకెందుకులే అని భావించినా.. తీరిక లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. నష్టం అందరి మీద పడుతుంది. అపార్టుమెంటు కళావిహీనంగా తయారవుతుంది. కాబట్టి, సంఘం నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్ర‌తి అంశాన్ని బైలాస్‌లో ప‌క్కాగా రాసుకోవాలి.

సంఘం ఏర్పాటు

అపార్టుమెంటు నిర్మాణం పూర్తైన తర్వాత.. లేదా పూర్తి అయ్యే తరుణంలో..నివాసితులంతా కలిసి నివాస సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బిల్డరే ఇందుకు చొరవ తీసుకోవాలి. లేకపోతే నివాసితులు కలిసి ఒక జట్టుగా ఏర్పడాలి. నిర్మాణ పటిష్టత, భద్రతా నిర్వహణకు సంబంధించి లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రెరా నిబంధ‌న‌ల కింద వ‌చ్చే కొత్త అపార్టుమెంట్ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త ఐదేళ్ల దాకా బిల్డ‌రు మీదే ఉంటుంది. కాబ‌ట్టి, ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. రెరా ప‌రిధిలోకి రాని అపార్టుమెంట్ల‌తోనే స‌మ‌స్య వ‌స్తుంది. ఫ్లాట్ల సంఖ్యను బట్టి సంఘంలో ఎంతమంది సభ్యులుండాలనే విషయంలో ముందుగా స్పష్టత రావాలి. యాభై కంటే తక్కువ ఫ్లాట్లు..అది కూడా ఒకే బ్లాకు మాదిరిగా ఉండే సంఘంలో ఐదారుగురు కీలక సభ్యులుండొచ్చు. కాకపోతే బిల్డర్లు, పలు నిర్మాణాల్ని టవర్లు లేదా బ్లాకుల మాదిరిగా నిర్మించారు. ఒక్కో బ్లాకు నుంచి సంఘంలో ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి సంఘంలో అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి తప్పక ఉండాలి. అపార్టుమెంటుకు సంబంధించి ప్రతి అంశంపై అధ్యక్షుడికి నియంత్రణ ఉండాలి. క‌మిటీ స‌మావేశ‌మై తీసుకునే నిర్ణ‌యాల్ని అమ‌లు చేయ‌డంతో పాటు రోజు వారి నిర్వహణకు సంబంధించిన పనులన్నీ కార్యదర్శి చూసుకోవాలి. ఆర్థిక విషయాల్ని కోశాధికారి పర్యవేక్షించాలి. వీరు కాకుండా ఉపాధ్యక్షుడు ఉమ్మడి కార్యదర్శి, ఉమ్మడి కోశాధికారి వంటివారూ ఉంటారు. ఆఫీస్ బేరర్లు ఎంత మంది ఉండాలో ముందే నిర్ణయించుకోవాలి. కమిటీ సభ్యులు నిర్వహణ రుసుమను పెంచుతున్నారంటే చాలా మంది నివాసితులు ఉగ్గి మీద గుగ్గిలం అవుతుంటారు. నేను కట్టను అంటే కట్టను ఏం చేస్తావో చేసుకో అని సవాల్ చేసేవారు లేకపోలేదు. అలా కాకుండా కమిటీ సభ్యులు చెప్పే విషయాల్ని నివాసితులంతా అర్ధం చేసుకుని క్షుణ్ణంగా ఆలోచింది.. అవసరమైతే ప్రత్యామ్నాయాల్ని సూచించాలి. అంతేకానీ కమిటీ సమావేశాల్లో వితండవాదం చేస్తే నష్టపోయేది అందులో నివసించే గృహయజమానులే.

రీట్ల‌లో మ‌దుపు! (బాక్స్‌)

కొనుగోలుదారుల నుంచి బిల్డర్/ డెవలపర్ ముందే కార్పస్ ఫండ్ వసూలు చేస్తాడు. ఏ సంఘమైనా నిర్వహణలో ఇబ్బందులు ఎదురు కావొద్దంటే, కార్పస్ ఫండ్ ను దేనికోసం వినియోగించాలి. ఏయే అవసరాలకు వాడకూడదనే అంశంలో స్పష్టంగా రాతకోతలుండాలి. ఈ అంశంలో నగరానికి చెందిన పలు నివాస సంఘాలు చాలా స్పష్టంగ నిబంధనల్ని రాసుకోవాలి. ఈ సొమ్మును ఎన్నేళ్ల పాటు బ్యాంకులో కదలకుండా ఉంచాలి? ఒకవేళ తీయాల్సి వస్తే.. ఏయే సందర్భాల్లో ఆయా సొమ్మును వినియోగించాలి? వంటి విషయాల్ని స్పష్టంగా రాసుకోవాలి.

కార్ప‌స్ ఫండ్ ను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం వ‌ల్ల పెద్ద‌గా వ‌డ్డీ గిట్టుబాటు కాని ప‌క్షంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాలి. రీట్లు (రియ‌ల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్ర‌స్ట్‌)లు అధిక శాతం వ‌డ్డీని అంద‌జేస్తున్నాయి కాబ‌ట్టి.. వీటిలో కొంత సొమ్మును మ‌దుపు చేయ‌వ‌చ్చు. లేదా ఎక్క‌డైనా అభివృద్ధి చెందే ప్రాంతంలో సంఘం పేరు మీద ప్లాట్ల‌ను కొనుగోలు చేసి.. నాలుగైదేళ్ల త‌ర్వాత విక్ర‌యించినా మంచి రాబ‌డి చేతికొస్తుంది. ఇలా కాకుండా, వాణిజ్య స్థ‌లాల్లో పెట్టుబ‌డి పెట్టినా మెరుగ్గానే ఉంటుంది. మొత్తానికి సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాల్ని ఎంచుకుంటే ఉత్త‌మం.
అపార్టుమెంట్ లోప‌లి భాగంలో పూర్తి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను నిర్వ‌హ‌ణ సంఘం చూసుకోవాలి. బ‌య‌టి అంశాల‌తో సంఘానికి ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. అధిక శాతం మంది ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకోవాలి. ఆ నిర్ణ‌యాన్ని కూడా కొంద‌రు నివాసితులు వ్య‌తిరేకించే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక నిర్ణ‌యానికి సానుకూలంగా ఓటేసిన వారంతా.. ఇలా వ్య‌తిరేకించే వారిని దారిలోకి తేవాలి. స‌హ‌జంగా, క‌మిటీ మీద లేదా అందులోని క‌మిటీ స‌భ్యుల మీద ఉండే వ్య‌క్తిగ‌త ద్వేషంతో ఇలా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.
మీరు గేటెడ్ క‌మ్యూనిటీని నిర్వ‌హిస్తున్నారా? మొత్తం మీ క‌మిటీ స‌భ్యులెంత మంది? వారి నేప‌థ్యం ఏమిటి? మీరు మీ సంఘాన్ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి? వాటిని ఎలా ప‌రిష్క‌రిస్తున్నారు? మీరు తీసుకున్న వినూత్న నిర్ణ‌యాలేమిటి? వాటి వ‌ల్ల క‌లుగుతున్న ప్ర‌యోజ‌న‌మేమిటి? ఇలాంటి వివ‌రాల‌న్నీ క్షుణ్నంగా రాసి.. మీ సంఘ స‌భ్యుల ఫోటోను మాకు మెయిల్ చేయండి. మీ స‌క్సెస్ స్టోరీని మేం ప్ర‌చురిస్తాం. మా మెయిల్ ఐడీ: regnews21@gmail.com
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles