poulomi avante poulomi avante

ప్రతి కమ్యూనిటీలో ప్లాస్టిక్ నిషేధించాలి

All Apartments, Gated Communities, Villa Projects should ban plastic usage.

ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగించడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీని ప్రకారం మన దేశంలో.. 2022 జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడటం నిషిద్ధం. గతంలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రయత్నాలు జరిగినా ఆశించిన ఫలితాలు అమలులో కనిపించలేదు. మ‌రి, మన భూమి.. మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఎవరో ఒకరు మ‌న‌కు చెప్పాలా? బాధ్యత గల పౌరులుగా మన సమాజాన్ని మనమే కాపాడుకోలేమా? మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన భూమిని, పరిశుద్ధమైన జలనిధుల్ని, స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన గురుతర బాధ్యత మన మీదే ఉంది క‌దా.. మరి, ఇందుకోసం మనమంతా ఏం చేయాలి?

దేశంలోని 140 కోట్ల భారతీయ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. కొత్త చట్టం ప్రకారం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేసినా, నిల్వ ఉంచినా, పంపిణీ చేసినా, విక్రయించినా చట్ట వ్యతిరేకమని గుర్తించాలి. ప్లాస్టిక్ స్ట్రాలు, థర్మాకోల్, డిస్పోజబుల్ ప్లాస్టిక్, కప్స్, ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ కప్స్, గ్లాసెస్, స్వీట్ బాక్సులు, కత్తులు, పీవీసీ బ్యానర్లు, ప్లేట్లు, స్ట్రాలు, ట్రేలు, స్పూన్లు, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ అలంకార సామగ్రి, సిగరేట్ పెట్టెలు వంటి పంతొమ్మిది రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువు వినియోగాన్ని నిషేధించారు. 2060 నాటికి 1.2 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతాయని.. ఇది ప్రపంచ సమస్యగా మారుతుందని ఇప్పటికే అంతర్జాతీయ పర్యావరణ వేత్తలు హెచ్చ‌రిస్తున్నారు.

ఏటా 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్

మన భారతదేశంలో దాదాపు పద్నాలుగు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను ప్రతిఏటా వినియోగిస్తారు. వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా పారవేసే యంత్రాంగం మన వద్ద లేద‌నే విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తించాలి. అందుకే కొన్నేళ్ల నుంచి ఈ విష వ్యర్థాలతో సహజీవనం చేయాల్సిన ఆగత్యం ఏర్పడింది. 1950 నుంచి ఉత్పత్తి అయిన 8 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ లో సుమారు అరవై శాతం నేల, నీటిలో నిక్షిప్తమైందని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవ విచ్ఛిన్నం అయ్యేందుకు ఎంతకాలం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం హర్షణీయం.

కమ్యూనిటీలన్నీ కలిసికట్టుగా

నగరాలు, పట్టణాల్లో గల అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, విల్లా కమ్యూనిటీలు, వ్యక్తిగత గృహాల్లో నివసించే ప్రజలంతా.. తమ వంతు బాధ్యతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలి. ఇందుకోసం ఆయా నివాస సంక్షేమ సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇందుకు సంబంధించి నివాసితులంతా ఒకే మాట మీద నిలబడాలి. మన వీధులు, నాలాలు, చెరువులు, నదులు, మహాసముద్రాలన్నీ ప్లాస్టిక్ అవశేషాలతో నిండిపోయి మన మనుగడ ప్రమాదంలో పడింది. ఇదే కొన‌సాగితే ఎక్క‌డ చూసినా ప్లాస్టిక్కే ద‌ర్శ‌న‌మిచ్చే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఈ అంశాన్ని గుర్తించి ప్రతి కమ్యూనిటీ ఇందుకు సంబంధించి అడుగులు ముందుకేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ప్రతి నివాస సంక్షేమ సంఘం కఠినంగానే వ్యవహరించాలి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు వ్యక్తులు కావాలని అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నించినా.. వారిని పట్టించుకోకూడదు. మనమంతా నివసించేందుకు భూమి మాత్రమే ఉందని.. మరో గ్రహం లేదని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి తెలివిగా వ్యవహరించి.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి. ఈ విష‌యంలో మ‌న‌మంతా ఒక తాటిపై నిల‌బ‌డాలి.

మీ అపార్టుమెంట్లో ప్లాస్టిక్ వాడట్లేదా?

మీ అపార్టుమెంట్‌లో ప్లాస్టిక్ వాడ‌కాన్ని నిషేధం విధించారా? మీ గేటెడ్ క‌మ్యూనిటీ వాసులంతా ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ఒకే మాట మీద నిల‌బ‌డ్డారా? కాస్త క‌ష్ట‌మైనా మీ అపార్టుమెంట్ వాసులు ప్లాస్టిక్‌ను వాడ‌టం లేదా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించ‌డంలో నివాస సంక్షేమ సంఘాలు చురుకైన పాత్రను పోషిస్తున్నాయా? అయితే, మీ సంఘ సభ్యుల ఫోటోతో స‌హా మీరు అనుస‌రించిన విధానాన్ని మాకు క్లుప్తంగా రాసి పంపించండి. మీ వివ‌రాల్ని మా పేప‌ర్‌లో ప్ర‌తివారం ప్ర‌చురిస్తాం. మీ ఫోటోలు, అపార్టుమెంట్ ఫోటోలను పంపాల్సిన మా మెయిల్ ఐడీ regnews21@gmail.com.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles