ఔను.. మీరు చదివింది నిజమే. నగరంలో పేరెన్నిక గల రియల్ సంస్థ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా.. కడ్తాల్లో డెవలప్ చేస్తున్న బట్టర్ ఫ్లై సిటీలో ఆరంభ ప్లాటు ధర.. రూ.8.25 లక్షలే. ఇదే సంస్థ డెవలప్ చేస్తోన్న స్మార్ట్ సిటీలో ప్లాటు కావాలంటే రూ.12 లక్షలు పెడితే సరిపోతుంది. ఇంచుమించు ఇదే ధరలో మీకు ప్లాటు కావాలంటే సదాశివపేట్లో కూడా దొరుకుతుంది. అక్కడ సుస్థిరా ఇన్ఫ్రా అనే సంస్థ ఫార్చ్యూన్ ప్రైడ్ & క్రీసెంట్ అనే వెంచర్లో ఆరంభ ప్లాటు ధర రూ.10.94 లక్షలుగా నిర్ణయించింది. షాద్ నగర్ల రాయల్ నిర్మాణ్ సంస్థ వాటర్ ఫ్రంట్ లేఅవుట్లో 150 గజాల ప్లాటు రూ.13.50 లక్షలకు విక్రయిస్తోంది.
యాచారంలో ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ సంస్థ శివనంది-2 లేఅవుట్లో 165 గజాల ప్లాటును రూ. 14.85 లక్షలకే విక్రయిస్తోంది. నాగపూర్ హైవే మీద టీఎంఆర్ సంస్థ ఆరంభించిన గ్రీన్ మిడోస్లో 165 గజాల ప్లాటు రూ.17.59 లక్షలుగా నిర్ణయించారు. కాస్త అభివృద్ధి చెందిన ఏరియాలో.. భవిష్యత్తులో డెవలప్‌మెంట్‌కి అధిక అవకాశాలున్న ప్రాంతాల్లో ప్లాట్లు కొనాలంటే.. గజానికి కనీసం రూ.20 వేలు పెట్టనిదే దొరకదని గుర్తుంచుకోండి. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల నివసించాలని భావించేవారు.. అంటే గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కట్టుకుని నివసించాలని భావించే వారంతా.. వర్టెక్స్ హోమ్స్ గిగాసిటీ వైపు చూస్తున్నారని సమాచారం. మరి, శివారు ప్రాంతాల్లో వివిధ రియల్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వెంచర్లు, అందులో ప్లాటు కనీస సైజు, ధర గురించి తెలుసుకోవాలంటే, ఈ పట్టిక చూస్తే మీకే అర్థమవుతుంది.
వెంచర్ పేరు | ఎక్కడ? | రియల్టర్ | సంఖ్య | ఎన్ని గజాలు? | రేటెంత? |
గిగా సిటీ | తుక్కుగూడ | వర్టెక్స్ హోమ్స్ | – | 300- 1600 | 1.50- 1.83 కోట్లు |
ఫార్చ్మూన్ కీర్తి | ఘట్ కేసర్ | గ్రీన్ హోమ్ | 461 | 220 | 63- 70 లక్షలు |
అగాలియా | కొంపల్లి | హస్తిన రియాల్టీ | 88 | 150 – 500 | 49.5 లక్షలు – 1.02 కోట్లు |
బ్రీసా | కడ్తాల్ | హస్తిన రియాల్టీ | – | 150 – 500 | 25.5 – 59.5 లక్షలు |
నేచర్ సిటీ | షాద్ నగర్ | హస్తిన రియాల్టీ | – | 150 – 500 | 23.81- 67.36 లక్షలు |
వాటర్ ఫ్రంట్ | షాద్ నగర్ | రాయల్ నిర్మాణ్ | 287 | 150 – 360 | 13.50 లక్షలు |
ఎన్ఆర్ఐ అబోడ్స్ | సదాశివపేట్ | శ్రీవిజయగణపతి | 784 | 167 – 500 | 33 – 63.99 లక్షలు |
టీఎంఆర్ గ్రీన్ మిడోస్ | చేగుంట | టీఎంఆర్ | – | 165 – 500 | 17.59- 56.98 లక్షలు |
ఆయాంశ్ గ్లోరీ సిటీ | ఘట్ కేసర్ | ఆయాంశ్ డెవలపర్స్ | 311 | 150 – 300 | – |
టెక్సడో పార్క్ | చౌటుప్పల్ | వర్టూసా లైఫ్ స్పేసెస్ | – | 183- 1000 | 20.9 – 40.8 లక్షలు |
ప్రక్రుతి శిఖర | భువనగిరి | ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ | 1039 | 165 – 600 | 24.75- 90.02 లక్షలు |
శివనంది-2 | యాచారం | ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ | 118 | 165 – 320 | 14.85 – 28.8 లక్షలు |
స్ప్రింగ్ ఫీల్డ్ విల్లాస్ | కొండకల్ | హర్షిత్ ఇన్ఫ్రా | – | 238 – 267 | – |
మెట్రో సిటీ | రుద్రారం | ప్రకాష్ గ్రూప్ | 226 | 150- 400 | 39.36 – 96.01 లక్షలు |
మెట్రో సిటీ ఎట్ ఐఐటీ | కంది | ప్రకాష్ గ్రూప్ | – | 150- 400 | 46 – 58 లక్షలు |
గ్రీన్ ఎవెన్యూస్ | ఐఐటీ | ప్రకాష్ గ్రూప్ | 297 | 150-400 | 49.49 – 82.49 లక్షలు |
పావని ట్రినిటీ | కొత్తూరు | శ్రీ వారాహీ ఇన్ఫ్రా | 343 | 165- 300 | – |
ఫార్చ్యూన్ ప్రైడ్ & క్రీసెంట్ | సదాశివపేట్ | సుస్థిరా ఇన్ఫ్రా | – | – | 10.94 – 36.49 లక్షలు |
హైవే మిడోస్ | షాద్ నగర్ | మహతీ ఇన్ఫ్రా | – | 166- 460 | – |
హల్దీ గోల్ఫ్ కౌంటీ | తూప్రాన్ | కంచర్ల, గిరిధారి | – | 2700 – 9000 ఎస్ఎఫ్టీ | 75 లక్షలు – 2.50 కోట్లు |
ఫార్చ్యూన్ బట్టర్ ఫ్లై సిటీ | కడ్తాల్ | ఫార్చ్యూన్ ఇన్ఫ్రా | 516 | 1485- 9000 ఎస్ఎఫ్టీ | 8.25 – 50 లక్షలు |
ఫార్చ్యూన్ నెక్టార్ | కర్కలాపాడు | ఫార్చ్యూన్ ఇన్ఫ్రా | – | 1800 – 2700 ఎస్ఎఫ్టీ | 12 – 18 లక్షలు |
ఫార్చ్యూన్ గ్రాండ్ ఎక్స్ టెన్షన్ 2 | కడ్తాల్ | ఫార్చ్యూన్ ఇన్ఫ్రా | 25 | 1981 – 5726 ఎస్ఎఫ్టీ | 20.89 – 60.41 లక్షలు |
ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ | పోలెపల్లి | ఫార్చ్యూన్ ఇన్ఫ్రా | 520 | 150 – 336 | 12.0 – 26.88 లక్షలు |
హైవే గ్రీన్ విల్లా | ఫార్మాసిటీ | జోల్టన్ ఇన్ఫ్రా | 78 | 147 – 350 | 19.1 – 45.49 లక్షలు |
శ్రీనివాసం | పిగ్లీపూర్ | కౌటీల్య హోమ్స్ | – | 147 – 339 | 20.59 – 47.54 లక్షలు |
పైన్ వుడ్ హోమ్స్ | ఘట్ కేసర్ | మోడీ బిల్డర్స్ | 560 | 2097 – 2403 ఎస్ఎఫ్టీ | 26.9 – 30.83 లక్షలు |
బీచ్ వుడ్స్ | వాడ్రేవు, చీరాల | హెచ్ పీఆర్ ఇన్ఫ్రా | 200 | 244 – 249 | 26.84- 27.6 లక్షలు |