సుచిరిండియా ఎండీ కిరణ్ పై కేసు నమోదు

సుచిర్ ఇండియా ఎండీ లయన్ వై కిరణ్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుచిర్ ఇండియా సంస్థలో పని చేస్తున్న అకౌంటెంట్ ని ఒక గదిలో నిర్బంధించి అతని పై దాడి చేశాడని కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే..

ప్రియాంక్ అనే వ్యక్తి రెండు నెలలుగా సుచిర్ ఇండియాలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కంపెనీ లెక్కల్లో రూ 5 లక్షలు తేడా రావడంతో నందీనగర్ లోని తన ఆఫీసుకు ప్రియాంక్ ని పిలిచి.. 5 లక్షలు ఏమయ్యాయి అంటూ దాడి చేయడమే కాకుండా ఒక గదిలో కూడా నిర్బంధించాడు. కిరణ్ బయటకు వెళ్లిన సమయంలో డయల్ 100 కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడిని బంజారాహిల్స్ పోలీసులు రక్షించారు. అనంతరం ప్రియాంక్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు.

This website uses cookies.