Categories: TOP STORIES

పౌలోమీ అవాంతే.. ఆరు నెల‌ల్లో హ్యాండోవ‌ర్‌!

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ హబ్ కు దగ్గర్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేటలో పౌలోమీ సంస్థ అవాంతే ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నిర్మాణ ప‌నుల్ని శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో కేవలం ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి. 4.75 ఎకరాల స్థలంలో 3 బ్లాకుల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 475 ఫ్లాట్ల‌ను క‌డుతున్నారు. రెండు సెల్లార్లు, గ్రౌండ్, 22 అంతస్తుల్లో ఒక్కో టవర్ ఉండనుంది. సకల సదుపాయాలతో 28వేల చదరపు అడుగుల్లో అదిరిపోయే క్లబ్ హౌస్ డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో ఈ ఫ్లాట్లను కొనుగోలుదారుల‌కు అప్పగిస్తారు.

This website uses cookies.