ఇల్లు అనేది మనిషి జీవితంలో అత్యంత ఎక్కువ పెట్టుబడి పెట్టే అంశం. పది కాలాలపాటు ఇల్లు చక్కగా ఉండాలంటే దాని నిర్వహణ సరిగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలను సైతం వెంటనే సరి చేయాలి. మరి ఇంటికి మరమ్మతులు ఎప్పుడు చేయాలో ఓ సారి చూద్దామా?
మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు.. ఓ సారి పెయింటింగ్ వేయిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చినా.. బాత్రూం ఫ్లోర్ రిపెయిర్ చేయాలని, కిచెన్ కేబినెట్లు పాడైపోయాయి మార్చాలని మీ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నా.. మీరు సోఫాలో సేదతీరి పడుకున్నప్పుడు సీలింగ్ లో నుంచీ లీకేజీ మరకలు కనిపించినా.. మరమ్మతులు అవసరమని గుర్తించాల్సిందే. వాస్తవానికి పైకప్పులు లేదా గోడలు లీక్ అవుతుంటే ఇల్లు బలహీనమైనట్టే. ఈ లీకేజీలు తరచుగా కనిపించవు. అందువల్ల మనం ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ లీకేజీ కనిపిస్తే.. వెంటనే మరమ్మతు చేయించాల్సిందే. ఒకవేళ అలా వదిలేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పైకప్పులు, గోడలను తనిఖీ చేసి లీకేజీలు నివారించాలి. గోడల లీకేజీ పరిష్కరించిన తర్వాత పెయింటింగ్ వేయడం మరచిపోకూడదు.
This website uses cookies.