Prestige City Selling Flats without Rera
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిధుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. భూమి కొనుగోలు సహా పలు రియల్ ప్రాజెక్టుల కోసం నిధుల సేకరణకు గోల్డ్ మన్ సాచ్స్ తో చర్చలు జరుపుతున్న సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకునే ప్రక్రియ దాదాపు ముగింపు దశలో ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్.. గోల్డ్ మన్ సాచ్స్ ను భాగస్వామిగా తీసుకోబోతోంది. అదే సమయంలో తనకు నిధులు ఇవ్వగలిగే ఇతర కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నిధుల కోసం పలు కంపెనీలతో చర్చలు ముగిశాయని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. ప్రారంభ కార్పస్ ఫండ్ రూ.2500 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఒప్పందం తుది దశలో ఉందని చెప్పిన ఆయన.. ఏ కంపెనీతో ఒప్పందం ఖరారైందో వెల్లడించలేదు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించడానికి గోల్డ్ మన్ సాచ్స్ నిరాకరించింది.
This website uses cookies.