poulomi avante poulomi avante

రహదారి నుంచి చూస్తే.. రాజసంలా కన్పించే రాజపుష్ప ప్రావిన్షియా

ఇప్ప‌టివ‌ర‌కూ ఎయిర్ పోర్టు నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా గ‌చ్చిబౌలి వైపు వెళ్లేవారికి.. మై హోమ్ అవ‌తార్ టవర్లు కనిపిస్తాయి. కానీ, కొన్ని రోజుల త‌ర్వాత ఆ టవర్లు ఇక కనిపించవు. ఎందుకంటే, దాన్ని స్థానంలో రాజ‌పుష్ప ప్రావిన్షియా దర్శనమివ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకో తెలుసా? అవ‌తార్ ఎత్తు కేవ‌లం 30 అంత‌స్తులే. కానీ, ప్రావిన్షియా ఎత్తు జి+39 అంత‌స్తులు. అంటే, ఈ ప్రాజెక్టే కొన్ని నెలల తర్వాత ఈ ర‌హ‌దారి మీదుగా వెళ్లేవారిని క‌నువిందు చేస్తుంద‌న్న‌మాట‌. టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంద‌న్న‌మాట‌. మ‌రి, ఇంత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న ఈ ప్రాజెక్టు విశిష్ట‌త‌ల‌ గురించి తెలుసుకుందామా..!

నానక్ రాంగూడ నుంచి నార్సింగి వైపు సర్వీసు రోడ్డు మీద నుంచి వెళుతుంటే.. ఎడమవైపు రాజపుష్ప ప్రావిన్షియా నిర్మాణ పనులు జోరుగా జరగడాన్ని చూడొచ్చు. అంతెందుకు, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికీ ప్రాజెక్టు చక్కగా దర్శనమిస్తుంది. ప్రావిన్షియాలో ఆస్ట్రా టవర్ 18వ అంతస్తులో శ్లాబు పని జరుగుతుండగా… బేసిల్ 17వ అంతస్తు, కోరల్ 23వ అంతస్తు, డాఫ్నే 20వ అంతస్తు, ఎలెనా 15వ ఫ్లోర్, ఫియోనా 14వ అంతస్తు.. మొత్తానికి, ఇలా వివిధ టవర్ల నిర్మాణ పనుల్ని యమజోరుగా జరిపిస్తోందీ సంస్థ. ఒకే ప్రాజెక్టులో రెండు క్ల‌బ్ హౌజులున్న ప్రాజెక్టు హైద‌రాబాద్‌లో ఏదైనా ఉందా అంటే.. క‌చ్చితంగా అది రాజ‌పుష్ప ప్రావిన్షియా అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే, సుమారు ల‌క్ష‌న్నర చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం క్ల‌బ్ హౌజ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌ చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది. ఇండోర్ మ‌రియు ఔట్ డోర్ ఫిట్‌నెస్ స్టేష‌న్‌, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వంటివి ప్ర‌తిఒక్క‌ర్ని క‌నువిందు చేస్తాయి. ప్రాజెక్టు ఎంట్రెన్స్‌లోనే స్కై వాక్‌ను ఏర్పాటు చేస్తారు. సుమారు 1.3 కిలోమీట‌ర్ల దూరం మేర‌కు వాకింగ్ ట్రాక్ ఉంటుంది. దీంతో ఆరోగ్యాభిలాషుల‌కు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. డ‌బుల్ హైట్ బ్యాంకెట్ హాల్‌, రెస్టారెంట్‌, కాఫీ షాపు, ఏసీ వెయిటింగ్ లాంజి గ‌ల స్కూలు బ‌స్ బే వంటి అనేక స‌దుపాయాలు, సౌక‌ర్యాల్ని రాజ‌పుష్ప ప్రావిన్షియాలో పొందుప‌రిచారు.

అడ్వెంచ‌ర్ జోన్‌, వాట‌ర్ స్కేప్‌..

ల్యాండ్ స్కేపింగ్‌, ఔట్‌డోర్ ఎమినిటీస్ ప్ర‌తిఒక్క‌ర్ని క‌నువిందు చేస్తాయి. న‌గ‌రంలోని అనేక క‌మ్యూనిటీల్లో కేవ‌లం క్రెష్ కోసం స్థ‌లం కేటాయించి వ‌దిలేస్తారు. కానీ, ఇక్క‌డ ఇందుకు భిన్నంగా ఏం చేశారంటే.. ఎన్‌క్లోజ్డ్ ప్లే ఏరియాను కూడా కేటాయించారు. దీని వ‌ల్ల చిన్నారులు అక్క‌డే వివిధ ఆట‌ల్ని ఆస్వాదించే వీలుంటుంది. కిడ్స్ ప్లే ఏరియాల‌తో బాటు అడ్వెంచ‌ర్ జోన్‌కు పెద్ద‌పీట వేశారు. ప‌సిపిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా క్రియేటివ్ స్టూడియోను డిజైన్ చేశారు. పెబల్స్ పాత్‌వే తో పాటు హీలింగ్ గార్డెన్, ఔట్ డోర్ యోగా, ఎరోబిక్స్ డెక్‌, యాంఫీ థియేట‌ర్‌, రిక్రియేష‌న‌ల్ మ‌రియు ఇంటరాక్టీవ్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తెస్తారు. మ‌న‌లో చాలామందికి ల్యాండ్ స్కేప్ గురించి తెలుసు. కానీ, ఇందులో ప్ర‌ప్ర‌థ‌మంగా వాట‌ర్ స్కేప్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అత్య‌వ‌స‌రాల్లో ద‌వాఖానాలు మ‌రియు ఫార్మ‌సీ ఉంటుంది. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం ప్ర‌త్యేకంగా సూప‌ర్ మార్కెట్, ఏటీఎం సౌక‌ర్యం వంటివి ఉంటాయి.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్దపీట

సుమారు 23.75 ఎక‌రాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించేది కేవ‌లం ప‌ద‌కొండు ట‌వ‌ర్లే. ఫ్లాట్ల సైజు విష‌యానికి వ‌స్తే.. 1370 – 2660 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉంటాయి. ప్రీమియం లైఫ్ స్ట‌యిల్ కోరుకునేవారికి అతికిన‌ట్లు స‌రిపోతుందీ ప్రాజెక్టు. ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ప్రోత్స‌హించి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేసిందీ సంస్థ‌. అందుకే, హైద‌రాబాద్‌లోనే ప్ర‌ప్ర‌థ‌మంగా ఎల‌క్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ స‌దుపాయం ఉంటే చాలు, అనేక‌మంది కొనుగోలుదారులు పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల బ‌దులు.. కాస్త ఖ‌ర్చు ఎక్కువైనా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.8299 చెబుతోందీ సంస్థ‌. మరెందుకు ఆలస్యం.. ఒక్కసారి మీరు ఈ ప్రాజెక్టును సందర్శిస్తే.. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులోనే మీకు న‌చ్చిన‌ట్లుగా మీ క‌ల‌ల గృహాన్ని తీర్చిదిద్దుకుంటారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles