Categories: PROJECT ANALYSIS

ప్రాజెక్టు స్టేటస్.. రాజపుష్ప ప్రావిన్షియా ప్రత్యేకతే వేరు

హైదరాబాద్లో నాణ్యమైన నిర్మాణాల్ని రాజపుష్ప ప్రాపర్టీస్ చేపడుతుంది. ఈ సంస్థ ఇప్పటివరకూ పూర్తి చేసిన నిర్మాణాల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలైనా.. విల్లా ప్రాజెక్టులైనా.. వాణిజ్య సముదాయాలైనా.. సకాలంలో అందజేస్తుందనే ఖ్యాతినార్జించింది. ఈ సంస్థ తాజాగా మైహోమ్ అవతార్ పక్కనే రాజపుష్ప ప్రావిన్షియా rajapushpa provincia అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ప్రీమియం లైఫ్ స్టయిల్ కోరుకునేవారికి ఈ నిర్మాణం చక్కగా నప్పుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

రాజపుష్ప ప్రావిన్షియాలో 2, 3 పడక గదులకు పెద్దపీట వేసింది. రెండు పడక గదుల ఫ్లాట్లు అయితే 1370 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా.. మూడు పడక గదుల ఫ్లాట్లను 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో కడుతోంది. ధర విషయానికి వస్తే.. 2పడక గదుల ఫ్లాటు రూ.90.74 లక్షల నుంచి ఆరంభమవుతుంది. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు రూ.1.13 కోట్లుగా చెబుతున్నారు. 2025 మార్చిలో మొదటి విడత ఫ్లాట్లను అందించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.

రాజపుష్ప ప్రావిన్షియా ప్రాజెక్టు ప్రత్యేకతలివే..

రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రాజెక్టు డిజైనింగ్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఫ్లాట్ సైజులు, ఎలివేషన్, కారిడార్ స్పేస్, ఎంట్రెన్స్ లాబీ, నిర్మాణ సామగ్రి ఎంపిక.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకతను చాటి చెబుతోంది. 23.75 ఎకరాల విశాలమైన స్థలంలో.. 11 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ జి ప్లస్ 39 అంతస్తుల్లో కడుతోంది. హైదరాబాద్లోనే ప్రత్యేకంగా రెండు క్లబ్ హౌజుల్ని ఈ ప్రాజెక్టులో నిర్మిస్తోంది. దాదాపు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజుల్ని చేపడుతోంది. ప్రాజెక్టు మొత్తం 80 శాతం ఖాళీ స్థలమే. నిర్మాణం వచ్చేది కేవలం 20 శాతం స్థలంలోనే.

నగరంలోనే ప్రప్రథమం..

రానున్న రోజుల్లో ఎక్కువ‌గా ఎల‌క్ట్రిక్ కార్ల‌కు ఆద‌ర‌ణ పెరిగే అవ‌కాశ‌ముంది. ఈ అంశాన్ని ముందే గుర్తించిన రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్‌.. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కడా లేని విధంగా.. కారు పార్కింగుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల సౌక‌రాన్ని ప్ర‌త్యేకంగా క‌ల్పిస్తోంది. పైగా, ఇండోర్ ఏసీ బాస్కెట్ బాల్ కోర్టుకు అభివృద్ధి చేస్తోంది. ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి.

This website uses cookies.