Categories: TOP STORIES

రాజ‌పుష్ప న‌యా రికార్డు.. 2 వారాల్లో 120 ఫ్లాట్ల అమ్మ‌కం

  • కోకాపేట్ నియోపోలిస్‌లో అమ్మిన‌వి 70 ఫ్లాట్లు
  • తెల్లాపూర్ ప్రాజెక్టులో 50 ఫ్లాట్లు
  • ఎన్నిక‌ల ఫ‌లితంతో సంబంధం లేదు
  • హైద‌రాబాద్ మార్కెట్‌పై బ‌య్య‌ర్ల ధీమా

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్.. రెండు హై ఎండ్ ల‌గ్జ‌రీ ప్రాజెక్టుల్ని ఆరంభించింది. కోకాపేట్ మ‌రియు తెల్లాపూర్‌లో మొద‌లెట్టిన ఈ ప్రాజెక్టుల్లో.. ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 120 ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. ఇవ‌న్నీ హైఎండ్ ఫ్లాట్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల ఫలితాల‌తో సంబంధం లేకుండా.. హైద‌రాబాద్ రియ‌ల్ రంగంపై కొనుగోలుదారుల‌కు ఎక్క‌డ్లేని ధీమా నెల‌కొంద‌ని చెప్ప‌డానికిదే నిద‌ర్శ‌నం. మ‌రి, ఈ రెండు ప్రాజెక్టుల ప్ర‌త్యేక‌త‌ల‌పై రెజ్ న్యూస్ అందిస్తున్న స్పెష‌ల్ స్టోరీ మీకోసం..

కోకాపేట్ నియోపోలిస్‌లో రాజాపుష్ప కాసా ల‌గ్జూరా అనే అల్ట్రా ల‌గ్జ‌రీ ప్రాజెక్టును సుమారు 7.75 ఎక‌రాల్లో నిర్మిస్తోంది. రెరా అనుమ‌తి పొందిన ఈ నిర్మాణంలో ఐదు ట‌వ‌ర్ల‌ను క‌డుతోంది. నాలుగు బేస్‌మెంట్లు, స్టిల్ట్‌తో పాటు 51 అంత‌స్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టును మొద‌లెట్టింది. ఇందులో వ‌చ్చేవి మొత్తం 612 ఫ్లాట్లు కాగా.. ప్ర‌తి ఫ్లోరుకు 2 మ‌రియు మూడు ఫ్లాట్ల‌ను మాత్ర‌మే డిజైన్ చేసింది. ఒక్క క్ల‌బ్ హౌజునే సుమారు అర‌వై వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో డెవ‌ల‌ప్ చేస్తోంది. ప్ర‌తి ట‌వ‌ర్ మీద రూఫ్‌టాప్ ఎమినిటీస్‌ను డిజైన్ చేసింది. ఇక ఫ్లాట్ల విస్తీర్ణం విష‌యానికొస్తే.. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ల‌ను 5,735, 5,760 ప్ల‌స్ మెయిడ్ రూముతో క‌లిపి డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఫైవ్ బీహెచ్‌కే ఫ్లాట్ల‌ను 6,765, 7790 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు అద‌నంగా హోమ్ ఆఫీసు, హోమ్ థియేట‌ర్‌, మెయిడ్ రూము వంటివి పొందుప‌రుస్తున్నారు. అందుకే, ఈ ప్రాజెక్టును క్రౌన్ ఆఫ్ నియోపోలిస్ అని రాజ‌పుష్ప సంస్థ అభివ‌ర్ణిస్తోంది.

తెల్లాపూర్‌లో ఔరేలియా

ల‌గ్జ‌రీ నిర్మాణాల‌కు స‌రికొత్త చిరునామాగా నిలిచేలా ప్రాజెక్టుల్ని డిజైన్ చేయ‌డంలో రాజ‌పుష్ప ప్రాప‌ర్ట‌స్ ముందంజ‌లో ఉంటుంది. ఈ సంస్థ ఎలివేష‌న్లు కానీ అందులో పొందుప‌రిచే అమెనిటీస్ కానీ వ‌ర‌ల్డ్ కాస్త స్థాయిలో ఉంటాయ‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంస్థ తెల్లాపూర్‌లో తాజాగా ఆరంభించిన ఔరేలియా ప్రాజెక్టే ఇందుకు నిద‌ర్శ‌నం. రెరా అనుమ‌తి పొందిన ఈ నిర్మాణాన్ని సుమారు 12.51 ఎక‌రాల్లో అభివృద్ధి చేస్తోంది. ఇందులో వ‌చ్చేవి సుమారు ఏడు ట‌వ‌ర్లు. మొత్తం క‌ట్టేవి 1561 ఫ్లాట్లు. మూడు మ‌రియు నాలుగు బేస్‌మెంట్ల‌తో పాటు స్టిల్ట్ ప్ల‌స్ 56 అంత‌స్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టును రాజ‌పుష్ప డిజైన్ చేసింది. జి ప్ల‌స్ 6 అంత‌స్తుల ఎత్తులో క్ల‌బ్ హౌజ్‌ను ఏర్పాటు చేస్తోంది. స్టిల్ట్ లెవెల్‌లో 50 వేల చ‌ద‌ర‌పు అడుగులు, మ‌రో 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌లిపి మొత్తం ఎమినిటీస్‌ను డెవ‌ల‌ప్ చేస్తోంది. ప్ర‌తి ఫ్లోరుకు వ‌చ్చేవి కేవ‌లం నాలుగు ఫ్లాట్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఫ్లాట్ల సైజుల విష‌యానికొస్తే.. త్రీ బెడ్‌రూం ఫ్లాట్లు 3015 చ‌.అ., 3435 చ‌.అ. ప్ల‌స్ మెయిడ్ రూమును నిర్మిస్తున్నారు. ఫోర్ బెడ్రూమ్ విష‌యానికి వ‌స్తే.. 3,995, 4400 చ‌ద‌ర‌పు అడుగుల‌తో పాటు మెయిడ్ రూమును డెవ‌ల‌ప్ చేస్తున్నారు.

This website uses cookies.