Categories: TOP STORIES

క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క్రెడాయ్ హైద‌రాబాద్ కొత్త అధ్య‌క్షుడిగా వి.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌గ‌న్నాథ్ రావు, కోశాధికారిగా మ‌నోజ్ అగ‌ర్వాల్, ప్రెసిడెంట్ ఎల‌క్ట్‌గా ఎన్‌.జైదీప్‌రెడ్డిలు ఎన్నిక‌య్యారు. శుక్ర‌వారం క్రెడాయ్ హైద‌రాబాద్ సంఘానికి కాక‌తీయ హోట‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంఘానికి చెందిన స‌భ్యులంతా క‌లిసి నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్య‌క్షులుగా ప్ర‌దీప్‌రెడ్డి, ముర‌ళీమోహ‌న్‌, రాంబాబు, శ్రీకాంత్‌.. ఉమ్మ‌డి కార్య‌ద‌ర్శులుగా క్రాంతికిర‌ణ్ రెడ్డి, నితీష్ రెడ్డి లు ఎన్నిక‌య్యారు. ఈసీ స‌భ్యులుగా ఎన్నికైన‌వారిలో.. ఎ.వెంక‌ట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సంజ‌య్ కుమార్ బ‌న్స‌ల్‌, అమ‌రేంద‌ర్‌రెడ్డి, సుశీల్‌కుమార్ జైన్‌, మోరిశెట్టి శ్రీనివాస్‌, ఎం.శ్రీరామ్‌, ఎన్‌.వంశీధ‌ర్‌రెడ్డిలు ఉన్నారు. నూత‌నంగా ఎన్నికైన కొత్త కార్య‌వ‌ర్గం సుమారు రెండేళ్ల పాటు ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తారు. ఈ క్ర‌మంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి ప‌రిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ సంద‌ర్భంగా కాక‌తీయ హోట‌ల్‌లో జ‌రిగిన స‌మావేశంలో క్రెడాయ్ హైద‌రాబాద్ ఆఫీస్ బేర‌ర్లు పాత క‌మిటీ స‌భ్యుల్ని స‌త్క‌రించారు.

This website uses cookies.