దేశంలో స్థిరాస్తి కొనుగోలు, బదిలీ విషయాల్లో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు (ఓసీఐలు)కు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సాగు భూమి, ఫాంహౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీ మినహా మిగిలిన స్థిరాస్తి కొనుగోలు, బదిలీ విషయాల్లో తమ ముందుస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఫెరా చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఎన్నారైలు, ఓసీఐలు స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంపై ఆర్బీఐకి పలు సందేహాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ఆర్బీఐ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
This website uses cookies.