Categories: LATEST UPDATES

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో

    • ఫిబ్రవరి 11 నుంచి 13 దాకా..

క్రెడాయ్ 11వ ఎడిషన్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కోవిడ్‌–19 మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని మరీ ఈ షో నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 11 –13 ఫిబ్రవరి  2022వ తేదీ వరకూ జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రోపర్టీ షోలో నగరవ్యాప్తంగా ఉన్న సభ్య డెవలపర్లు, మెటీరియల్‌ వెండార్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌ మాన్యుఫాక్చరర్స్‌, కన్సల్టెంట్స్‌ మరియు ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్ పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్‌కు తగినట్లుగా డెవలపర్లు ప్రోపర్టీలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ప్రోపర్టీ షోలో అన్నీ పెద్ద సైజు స్టాల్స్‌ ఉంటాయి. అలాగే ఓపెన్‌ ప్రదేశం అధికంగా ఉండటంతో పాటుగా పెద్దవైన కారిడార్లు, కోవిడ్‌–19 మార్గదర్శకాలను అనుసరించాల్సి రావడం వల్ల పెద్ద లాంజ్‌ సైతం సమావేశాల కోసం అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో కేవలం టీఎస్‌–రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా  పీ రామకృష్ణా రావు, ప్రెసిడెంట్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘ అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న  హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం స్ధిరంగా, వేగంగా  వృద్ధి చెందుతుంది. గత రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరికీ పెను సవాల్‌గా నిలిచాయి.  మహోన్నతమైన ప్రతిభావంతులు ఉండటం చేత ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలో అత్యంత కీలకమైన కేంద్రంగా  హైదరాబాద్‌ మారింది. అత్యంత వేగంగా మారుతున్న సంస్కృతి కారణంగా ఎంతోమంది ఈ నగరాన్ని తమ ఆవాసంగా మార్చుకుంటున్నారు.

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్న ప్రజల రమారమి వయసు 35 సంవత్సరాలుగా ఉంది. గత రెండు దశాబ్దాలలో కనిపించిన ధోరణితో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత రెండు దశాబ్దాలలో కొనుగోలుదారుల  రమారమి వయసు  50 సంవత్సరాలుగా ఉంది. మహమ్మారి కారణంగా తప్పనిసరై హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ అనుసరించాల్సి రావడంతో భారీ సైజు అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. దీనికి గృహ ఋణాలపై అతి తక్కువ వడ్డీరేట్లు కారణం మరియు రియల్‌ ఎస్టేట్‌ ధరలు స్థిరంగా  ఉండటం చేత కొనుగోలుదారులకు అందుబాటు ధరలను అందిస్తుండడమూ కారణం. కొనుగోలుదారులకు తగిన సౌకర్యాలను అందించేందుకు  క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను 11– 13 ఫిబ్రవరి లో హైటెక్స్‌ నిర్వహించబోతున్నాం. దీని ద్వారా అత్యుత్తమ టీఎస్‌ –రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులను  గుర్తించి ఒకే దరికి తీసుకురానున్నాం’’ అని అన్నారు.

ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతా కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తుంది. మరీ ముఖ్యంగా భారీ ఎంఎన్‌సీలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికి తోడు ప్రకాశవంతమైన, వేగంగా వృద్ధి చెందుతున్న స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ ఈ వృద్ధికి తోడ్పాటునందించడంతో పాటుగా  నగరంలో ఉపాధి కల్పన కూడా చేస్తుంది. సమీప భవిష్యత్‌లో నగరంలో మూడు డాటా సెంటర్లు తెరుచుకోనున్నాయి.  దాదాపుగా 20,761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి అమెజాన్‌ డాటా సర్వీసెస్‌ , స్మార్ట్‌ డాటా సెంటర్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), గోల్డ్‌మన్‌ శాక్స్‌ నుంచి గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌ సెంటర్‌ ; ఫియట్‌ క్రిస్లర్‌ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) 150 మిలియన్‌ యుఎస్‌ డాలర్లను తమ నూతన గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ను నగరంలో ఏర్పాటుచేయడంతో పాటుగా 1000 ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడిగా పెట్టనుంది. వీటితో పాటుగా సైబర్‌ సెక్యూరిటీ లక్ష్యంగా కలిగిన కేంద్రాలైనటువంటి కొటెల్లిజెంట్‌ –డాటా డెమోక్రసీ కంపెనీ ఇప్పుడు సైబర్‌ వారియర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను హైదరాబాద్‌ నుంచి 1000 మంది సైబర్‌ వారియర్స్‌కు శిక్షణ  అందించేందుకు ఏర్పాట్లు  చేసింది. అంతేకాదు, మరిన్ని సంస్థలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇవన్నీ గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి’’ అని అన్నారు.

This website uses cookies.