poulomi avante poulomi avante

మియాపూర్‌లో రెడీ టు ఆక్యుపై బెస్ట్ గేటెడ్ క‌మ్యూనిటీ ఎక్క‌డో తెలుసా?

  • మొత్తం ట‌వ‌ర్లు: 11
  • 9 ట‌వ‌ర్ల‌లో గృహ‌ప్ర‌వేశం
  • చేరువ‌లోనే ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్లు,
    ఇంట‌ర్, ఇంజినీరింగ్ కాలేజీలు
  • ప్రాజెక్టు వ‌ద్ద‌కు ప్ర‌తిరోజు
    20 స్కూలు బ‌స్సులు

మియాపూర్ మెట్రో స్టేష‌న్ వ‌ర‌కూ.. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రావ‌డం వ‌ల్ల‌.. ఈ ప్రాంతం దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా మార్మోగి పోయింది. అప్ప‌ట్నుంచి దేశ‌విదేశీ సంస్థ‌ల్లో ప‌ని చేసే ఐటీ నిపుణులు కానీయండి.. ఫార్మా ఎంప్లాయిస్ అవ్వనీయండి.. మియాపూర్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంపై దృష్టి సారించారు. వీరితో పాటు వ్యాపారులు, పారిశ్రామిక‌వేత్త‌లు, విద్యా మ‌రియు వైద్య‌రంగంలోని నిపుణులు సైతం మియాపూర్లో క‌ల‌ల గృహాన్ని ఎంచుకోవ‌డానికి ప్రాధాన్య‌త‌నివ్వ‌డం ఆరంభించారు. మ‌రి, అలాంటి వారంద‌రికీ మియాపూర్‌లో రెడీ టు ఆక్యుపై గేటెడ్ క‌మ్యూనిటీ కావాలంటే.. దివ్య‌శ్రీశ‌క్తి ఒక మంచి ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. త‌క్కువ స్థ‌లంలో 30, 40 అంత‌స్తుల అపార్టుమెంట్ల‌ను క‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. అధిక విస్తీర్ణంలో కేవ‌లం జి ప్ల‌స్ తొమ్మిది అంత‌స్తుల్లో రూపుదిద్దుకున్న ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రాజెక్టు.. దివ్య‌శ్రీశ‌క్తి. ట్రిపుల్ మ‌రియు డ్యూప్లే ఫ్లాట్లు అందుబాటులో ఉన్న ఈ రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టు స్పెషాలిటీస్‌ను తెలుసుకుంటే.. మీరు వెంట‌నే ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటార‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర‌ముఖ విజ‌న‌రీ, దివ్య‌శ‌క్తి సంస్థ ఫౌండ‌ర్ కీర్తిశేషులు ఎన్‌వీ ర‌త్త‌య్య.. మియాపూర్ బ‌స్ డిపో వ‌ద్ద ఎదురుగా ఆరంభించిన ప్రాజెక్టే దివ్య‌శ్రీశ‌క్తి. ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని కోరుకునేవారికీ ప్రాజెక్టు చ‌క్క‌గా న‌ప్పుతుంది. సుమారు 11 ట‌వ‌ర్ల‌లో తొమ్మిది వంద‌ల ఫ్లాట్ల‌ను నిర్మించారు. ప్ర‌స్తుతం 9 ట‌వ‌ర్ల‌లు కొన్ని కుటుంబాలు నివ‌సిస్తున్నాయి. దివ్య‌శ్రీశ‌క్తి ప్రాజెక్టు లొకేష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనొచ్చు. ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే గ‌న‌క‌.. కెనెడీ, సిల్వ‌ర్ ఓక్స్ వంటి ఇర‌వై ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ బ‌స్సులు ఎంచ‌క్కా దివ్య‌శ్రీశ‌క్తి వ‌ర‌కూ వ‌స్తాయి. కాబ‌ట్టి, మీ చిన్నారుల స్కూళ్ల గురించి చింతించ‌క్క‌ర్లేదు. విజ్ఞాన్ స్కూల్ అయితే ఇక్క‌డ్నుంచి కూత‌వేటు దూరంలోనే ఉంటుంది. పేరెన్నిక గ‌ల ఇంట‌ర్, మెడిక‌ల్, డిగ్రీ క‌ళాశాల‌ల‌కు దివ్య‌శ్రీశ‌క్తి నుంచి సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు.

25 నిమిషాల్లో హైటెక్ సిటీకి..

దివ్య‌శ్రీశ‌క్తి ప్రాజెక్టు నుంచి మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి ఇర‌వై ఐదు నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. గ‌చ్చిబౌలికి అర‌గంట‌లో వెళ్లిపోవ‌చ్చు. ఇటీవ‌ల మ‌ల్లంపేట్లో కొత్త‌గా ఎగ్జిట్ సౌక‌ర్యాన్ని హెచ్ఎండీఏ క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది ఆరంభ‌మైతే ఔట‌ర్ రింగ్ రోడ్డుకు సుమారు ప‌ది నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. అంటే, న‌గ‌రంలోని ఎక్క‌డ్నుంచి అయినా.. దివ్య‌శ్రీశ‌క్తికి సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకేమో 45 నిమిషాలు, శామీర్‌పేట్‌లోని జీవోమ్ వ్యాలీకి గంట‌లో చేరుకోవ‌చ్చ‌ని గుర్తుంచుకోండి. ఇలాంటి సానుకూలాంశాలు, దివ్య‌శ్రీశ‌క్తి ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌ల్ని అర్థం చేసుకున్న అనేక మంది కొనుగోలుదారులు ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుండ‌టం విశేషం.

వాల్యూ ఫ‌ర్ మ‌నీ

క‌రోనా త‌ర్వాత హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలోకి ప్ర‌వేశించిన ప్రీలాంచ్ ప్ర‌మోట‌ర్లు.. కొనుగోలుదారుల నుంచి సొమ్ము తీసుకుని ప్రాజెక్టుల‌ను ఆరంభించ‌నే లేదు. అంత‌కంటే ముందు మొద‌లెట్టిన అపార్టుమెంట్లు పూర్తి కానే కాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మీ క‌ష్టార్జితానికి త‌గ్గట్టుగా చ‌క్క‌టి గృహం ఉండాల‌ని భావించేవారి ముందున్న చ‌క్క‌టి ఆప్ష‌న్‌.. దివ్య‌శ్రీశ‌క్తి గేటెడ్ క‌మ్యూనిటీ. జీవితంలోని మ‌ధుర క్ష‌ణాల్ని ఆస్వాదించాల‌ని భావించేవారికి చ‌క్క‌గా న‌ప్పుతుందీ ప్రాజెక్టు. మియాపూర్ మెట్రో స్టేష‌న్‌కి కూత‌వేటు దూరంలోనే నివ‌సించాల‌ని కోరుకునేవారికి.. రెడీ టు ఆక్యుపై గేటెడ్ క‌మ్యూనిటీయే.. దివ్య‌శ్రీశ‌క్తి. ఇందులో చిన్నారులు ఆడుకోవ‌డానికి ప్లే ఏరియాలు, ఆవ‌ర‌ణ‌లో ప‌చ్చ‌ద‌నం, తీరిక‌వేళ‌లో ప్ర‌శాంతంగా కూర్చుని చ‌ర్చించ‌డానికి ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు, ప్రాజెక్టు చుట్టూ వాకింగ్ ట్రాక్, ప‌క్క‌నే ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్ వంటివి ఉండ‌నే ఉన్నాయి.

సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబ‌ట్టి, మీరు మీ కుటుంబ స‌మేతంగా ఒక్క‌సారి మియాపూర్‌లోని బ‌స్ బాడీ యూనిట్ ఎదురుగా గ‌ల దివ్య‌శ్రీశ‌క్తి గేటెడ్ క‌మ్యూనిటీకి విచ్చేసి మోడ‌ల్ ఫ్లాట్‌ను చూస్తే చాలు అస‌లు విష‌యం మీకే అర్థ‌మ‌వుతుంది. ఈ ప్రాజెక్టు ప‌రిస‌రాల్ని సంద‌ర్శిస్తే.. మీరు నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఏమాత్రం ఆల‌స్యం చేయ‌ర‌ని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. మియాపూర్‌లో రెడీ టు ఆక్యుపై కోరుకునేవారికి ఇంత‌కుమించిన బెస్ట్ ప్రాజెక్టు లేనే లేద‌ని చెప్పొచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles