poulomi avante poulomi avante

అద్దె ఇల్లా.. సొంత గూడా?

  • ఏది మంచిది?

ఇల్లు కొనుక్కోవడం మంచిదా? అద్దెకు ఉండటం మంచిదా? అంటే సాధారణంగా ఇల్లు కొనడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే, ఇల్లు కొనే సామర్థ్యం.. అంటే ఈఎంఐ చెల్లించగలిగే పరిస్థితి ఉన్నవాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందనేది ఎక్కువ మంది వాదన. నిజానికి ఇల్లు కొనడం అనేదే తెలివైన పని. ఎందుకంటే ఎప్పటికైనా ఇంటి విలువ పెరుగుతుంది కానీ ఇంటి యజమానులకు చెల్లించే అద్దె వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. అయితే, లోతుగా విశ్లేషిస్తే.. ఇందులోనూ కొన్ని లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత 20 ఏళ్లలో జీతాల పెరుగుదల కంటే ఇళ్ల ధరలు బాగా పెరిగాయి. 1997లో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారిలో 55 శాతం మందికి సొంత ఇల్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 34 శాతం మాత్రమే. అంతేకాకుండా నెలవారీ ఆదాయంలో దాదాపు 25 శాతం చేరుకోవడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

  •  ఇల్లు కొనడం ద్వారా మనకు ఓ ఆస్తిని సమకూర్చుకున్నట్టు అవుతుంది. ఇందులో ఆర్థికపరమైన ప్రయోజనాలతోపాటు భావోద్వేగ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. పైగా ఇంటి విలువ పెరుగుతూ ఉంటుంది.
  • ఇంటిని కొనడం.. తర్వాత దానిని విక్రయించడం ద్వారా గృహ యజమానులు తమ సంపదను పెంచుకునే వీలుంటుంది. అదే అద్దె ఇంట్లో ఉంటే నెలవారీ కొంత మొత్తం అద్దె చెల్లించాలి. దానివల్ల మన సంపదకు ఎలాంటి లాభం చేకూరదు.
  • అద్దె ఇల్లు మన ఆస్తి కాదు. మరో మాటలో చెప్పాలంటే అద్దె అనేది నెలావారీ ఖర్చు మాత్రమే. అదే ఇల్లు కొనడం అనేది స్థిరమైన విలువలతో కూడిన పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే.
  • సొంత ఇల్లు కలిగి ఉన్న యజమానులు దాని నికర విలువ పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
  • సొంత ఇంటిని ఆదాయ వనరుగా కూడా మార్చుకోవచ్చు. తమ ఇంట్లో కొంత భాగాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. హోమ్ స్టేలు, ఇతర అద్దె సేవల ద్వారా వాణిజ్యపరమైన ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
  •  అద్దె ఆస్తులతో కాల క్రమేణా ఆదాయం కూడా పెరుగుతుంది. కొంత కాల వ్యవధిలో లేదా అద్దె ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పుడు అద్దెను పెంచుకునే అవకాశం ఉంటుంది.
  •  అద్దె ఆస్తులతో భూస్వాములు అద్దెను పెంచే హక్కును కలిగి ఉండటమే కాకుండా వారికి నోటీసు వ్యవధిని అందించడం ద్వారా అద్దెదారులను తొలగించవచ్చు. దీని ఫలితంగా తక్కువ వ్యవధిలో అద్దెదారులు మరొ అద్దె ఇల్లు చూసుకోవడం కాస్త కష్టమవుతుంది.
  •  ఈ రోజుల్లో కనిపించే మరో ఇబ్బంది ఏమిటంటే.. మనం అద్దెకు ఉంటున్న ఇంటిని నచ్చిన విధంగా మార్చుకోలేం. అదే సొంత ఇల్లు అయితే, మనకు నచ్చినట్టుగా మార్చుకునే వీలుంటుంది.
  •  ఆర్థిక స్థిరత్వం విషయంలో కూడా ఇంటిని అద్దెకు తీసుకోవడం చాలా నష్టాలను కలిగి ఉంటుంది. ఇంటి యజమానిగా కాకుండా అద్దెదారుగా ఉన్నప్పుడు క్రెడిట్ స్కోర్ ప్రభావం చేసే పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కోల్పోతారు. పైగా ఇది సంపదకు దేనినీ జోడించదు.
    ఈ నేపథ్యంలో భావోద్వేగ, ఆర్థిక ప్రయోజనాల కోణంలో చూస్తే.. ఇంటిని కొనుగోలు చేయడం అద్దె ఇంట్లో ఉండటం కంటే పలు ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles