రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ వడ్డీరేట్లను మరోసారి తగ్గించింది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంటే రెండు నెలల వ్యవధిలో 50 బేసిస్ పాయింట్లు తగ్గాయ్. ఈ నిర్ణయం వల్ల అనేక రుణాలపై ఇంట్రెస్ట్ రేట్స్.. అలాగే హోమ్ అండ్ ఆటో లోన్స్‌పై ఈఎంఐలు మరింత తగ్గవచ్చనే అంచనాలున్నాయ్. మరి గృహ రుణాలపై రేట్ కట్ ప్రభావం ఎలా ఉంటుందంటే..
ఆర్బీఐ రేపోరేట్లను కట్ చేయడమంటే కస్టమర్లను కనికరించడమే. గత ఐదేళ్లలో వడ్డీరేట్లు తగ్గించమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోని రిజర్వ్ బ్యాంక్.. రెండు నెలలుగా కస్టమర్లకు గ్యాప్ ఇవ్వకుండా శుభవార్తలు చెబుతూనే ఉంది. పైగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్బీఐ రెపోరేట్స్ మరోసారి కట్ చేయడం లోన్స్ పే చేసే వారికి బంపరాఫరే. వినియోగదారులకి ఈ ఏడాదిలో ఇలాంటి అద్భుతావకాశాలు రెండుసార్లు ఇచ్చింది ఆర్బీఐ. రెండుసార్లు కలిపి 50 పాయింట్లు తగ్గించింది. మరి వీటి వల్ల కస్టమర్లకు ఈఎంఐల మీద ఎంతమేర ఆదా కానుందో ఓసారి చూద్దాం.
లోన్ అమౌంట్ రూ. 30 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 26, 247
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 25, 071
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 1176
20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 2.82 లక్షలు
లోన్ అమౌంట్ రూ. 50 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 43, 745
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 41, 785
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 1960
20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 4.70 లక్షలు
లోన్ అమౌంట్ రూ. 70 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 61, 243
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 58, 499
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 2744
20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 6.58 లక్షలు
లోన్ అమౌంట్ రూ. కోటి అయితే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 87, 490
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 83, 570
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 3920
20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 9.40 లక్షలు
లోన్ అమౌంట్ రూ. కోటిన్నర అయితే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,31,235
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,25,355
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 5880
20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 14.11 లక్షలు
అదే లోన్ టెన్యూర్ ఐదేళ్లైతే..
లోన్ అమౌంట్ రూ. 30 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 62,275
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 61,550
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 725
ఐదేళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 43,500
లోన్ అమౌంట్ రూ. 50 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,03,792
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,02,583
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 1209
ఐదేళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 72, 540
లోన్ అమౌంట్ రూ. 70 లక్షలైతే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,45,308
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 1,43,616
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 1692
ఐదేళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 1,01,520
లోన్ అమౌంట్ రూ. కోటి అయితే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 2,07,584
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 2,05,165
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 2419
ఐదేళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 1,45, 140
లోన్ అమౌంట్ రూ. కోటిన్నర అయితే..
9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 3,11,375
8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ రూ. 3,07,748
వీటి మీద మంత్లీ సేవింగ్స్ రూ. 3,627
ఐదేళ్లలో మొత్తం ఆదా అయ్యేది రూ. 2,17,620