Categories: LEGAL

రూ.100 కోట్ల మోసం.. బిల్డర్ అరెస్ట్

  • ఆరుగురు కుటుంబ సభ్యులు కూడా..
ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన వ్యవహారంలో ఓ బిల్డర్ తోపాటు ఆయన కుటుంబానికి చెందిన ఆరుగురిని ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజ్ కుమార్ జైన్ అనే బిల్డర్ రెడ్ ఏపిల్, ఐడియా బిల్డర్స్ పేరుతో రెండు కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశచూపి పలువురు కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తం డబ్బు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లతో తమ ఇంటి పేరును గార్గ్ గా మార్చుకుని దుబాయ్ పౌరసత్వం సంపాదించి అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని వెల్లడించారు. ఈ క్రమంలో మోసం బయటపడటంతో జైన్ తోపాటు ఆయన కుమారులు నామన్, అక్షయ్, కుమార్తె అనూషా, భార్య ఇందు, బంధువులు రిషాబ్, ప్రతిక్ లను అరెస్టు చేసినట్టు వివరించారు. అలాగే దుబాయ్ పౌరసత్వ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా.. జైన్, అతడి బంధువులపై గతంలో దాదాపు 29 కేసులు ఉన్నాయని వివరించారు.

This website uses cookies.