poulomi avante poulomi avante

అమ్మ‌కాలు త‌గ్గినా పెరిగిన రిజిస్ట్రేష‌న్లు

  • 48 శాతం పెరుగుదల..
  • రూ.4,288 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు
  • నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి

హైదరాబాద్ లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ.. జూన్ లో ఇళ్ల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు మాత్రం పెరిగాయి. ఈ ఒక్క నెలలో రూ.4,288 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగినట్టు నైట్ ప్రాంక్ ఇండియా వెల్లడించింది. ఇది గతేడాది జూన్ తో పోలిస్తే 48 శాతం.. అంతకుముందు నెలతో పోలిస్తే 14 శాతం అధికం కావడం గమనార్హం.

రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే జూన్ లో 26 శాతం వార్షిక పెరుగుదలతో 7,014 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. ఇక హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. మొత్తమ్మీద ఏ ఏడాది మొదటి ఆరు నెలల్లో 39,220 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ కాగా.. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. ఇళ్ల విలువ పరంగా చూస్తే 39 శాతం అధికం. 2023 ప్రథమార్ధంలో రూ.17,490 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇది రూ.24,287 కోట్లకు పెరిగింది.

ఈ ఏడాది జూన్ లో రూ.50 లక్షల లోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. అయితే, మొత్తం అమ్మకాల్లో వీటి వాటా గతేడాది జూన్ తో పోలిస్తే 70 శాతం నుంచి 60 శాతానికి తగ్గింది. అదే సమయంలో రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువ ఉన్న ఇళ్లు 9 శాతం నుంచి 14 శాతానికి పెరిగాయి. దీనినిబట్టి కొనుగోలుదారులు విశాలమైన, లగ్జరీ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్ధమవుతోంది.

ఇక కొనుగోలుదారులు వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల మధ్య విస్తీర్ణం ఉన్న ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు జూన్ అమ్మకాల్లో తేలింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 68 శాతం ఉండటమే ఇందుకు నిదర్శనం. అలాగే 2వేల చదరపు అడుగుల పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా గతేడాది జూన్ లో 11 శాతం ఉండగా..

ఈ ఏడాది జూన్ లో 14 శాతానికి పెరిగింది. జిల్లాలవారీగా చూస్తే మొత్తం రిజిస్ట్రేషన్లలో 43 శాతం వాటాతో రంగారెడ్డి అగ్రస్థానంలో ఉంది. గతేడాది జూన్ తో పోలిస్తే ఇది 5 శాతం అధికం. 41 శాతం వాటాతో మేడ్చల్-మల్కాజ్ గిరి, 16 శాతం వాటాతో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్ గిరిలో 11 శాతం పెరుగుదల నమోదు కాగా, రంగారెడ్డి 8 శాతం, హైదరాబాద్ 7 శాతం పెరుగుదల నమోదు చేశాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles