Categories: TOP STORIES

జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు

    • నిజంగా ఇది సిగ్గు చేటు: మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య నిర్వహణ అస్సలు బాగాలేదని, ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. వీధుల్లో పారిశుద్ధ్యం అస్సలు బాలేది, ఎటు చూసినా చెత్తా చెదారమే కనిపిస్తోందని, ఫలితంగా దోమల స్వైర విహారంతో ప్రజలు విష జర్వాల బారిన పడుతున్నారని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లేందుకు ఆటోలు లేవని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఏళ్ల తరబడి రొటీన్ సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు.

దీంతో మేయర్ స్పందిస్తూ.. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం నిజమేనని అంగీకరించారు. తన పర్యటనల్లో చాలా చోట్ల చెత్త కుప్పలు పేరుకుపోయి ఉండటాన్ని స్వయంగా చూశానని చెప్పారు. చాలాసార్లు అధికారులను పిలిచి, రోడ్లపై చెత్త తొలగించాలని కోరానని, నగరం ఇలా ఉన్నందుకు సిగ్గుపడ్డానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు కార్పొరేటర్లతో కమిటీ వేసి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

This website uses cookies.