Categories: LEGAL

‘‘సాహితీ’’ వద్ద ఎన్ని ఆస్తులున్నాయి?

  • సబ్ రిజిస్ట్రార్లకు ఈడీ లేఖ

ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు రూ.1000 కోట్ల మోసానికి పాల్పడిన సాహితీ ఇన్ ఫ్రా సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా నిధుల మళ్లింపు జరిగిందని కేసు నమోదు చేసిన ఈడీ.. ఆ సంస్థ కొనుగోలు చేసినట్టు భావిస్తున్న స్థలాలకు సంబంధించిన వివరాలు పంపాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

ప్రీలాంచ్ ఆఫర్లతో సాహితీ సంస్థలు కొనుగోలుదారులను ఆకర్షించి భారీగా డబ్బులు వసూలు చేశాయి. వాటిలో చాలా ప్రాజెక్టులు మొదలుకాలేదు. దీంతో డబ్బులు చెల్లించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇటీవల సాహితీ ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేసి ఇక్కడ వసూలు చేసిన డబ్బును ఇతర సంస్థల్లోకి అక్రమంగా మళ్లించినట్టు గుర్తించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది.

This website uses cookies.