Categories: TOP STORIES

హైదరాబాద్ లో ఏడు కొత్త లింకు రోడ్లు..

హైదరాబాద్ లో ఏడు కొత్త లింకు రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. రూ.203.34 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్-3 లోని ప్యాకేజ్-1 కింద ఈ పనులు చేయనుంది. ఇటీవల ఫేజ్-3 లోని ప్యాకేజ్-3 కింద రూ.293 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన 13 కొత్త లింకు రోడ్ల పనులకు ఇవి అదనం. మొత్తం ఈ 20 లింకు రోడ్లను దాదాపు రూ.496 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే చేపట్టనున్నారు.

ఫేజ్-3లోని ప్యాకేజ్-1 కింద చేపట్టే లింకు రోడ్లు ఇవీ..

  • బాపూఘాట్ బ్రిడ్జి నుంచి పీఅండ్ టీ కాలనీ వరకు (2.10 కిలోమీటర్లు)
  • కొత్తూరు రైల్వే క్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్ (2.60 కిలోమీటర్లు)
  • కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక్ స్టీల్ (ఎన్ హెచ్ 44) వరకు (1.50 కిలోమీటర్లు)
  • ఎన్ హెచ్ 44 శంషాబాద్ బస్టాప్ నుంచి రాళ్లగూడ రోడ్డులోని ఒయాసిస్ స్కూల్ వరకు (4 కిలోమీటర్లు)
  • శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్డు (5 కిలోమీటర్లు)
  • ఎన్ హెచ్ 44 తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు (3 కిలోమీటర్లు)
  • గోపనపల్లి ఎన్ హెచ్ జంక్షన్ నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు (7 కిలోమీటర్లు)

This website uses cookies.