ప్రాపర్టీని అద్దెకిచ్చిన షాహిద్ కపూర్

నెలకు రూ.20.5 లక్షల అద్దె

ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ తన అపార్ట్ మెంట్ ను అద్దెకు ఇచ్చారు. ముంబై వర్లీలోని ఒబెరాయ్ రియల్టీ నిర్మించిన 360 వెస్ట్ లోని 5,395 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో కూడిన అపార్ట్ మెంట్ ను ఈ ఏడాది మేలో మీరా కపూర్ తో కలిసి రూ.58.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. తాజాగా ఆ అపార్ట్ మెంట్ ను నెలకు రూ.20.5 లక్షల చొప్పున ఐదేళ్ల కాలానికి అద్దెకు ఇచ్చారు.

రూ.20.5 లక్షలతో ప్రారంభమైన ఈ అద్దె ఐదేళ్ల కాలంలో క్రమంగా రూ.23.98 లక్షలకు చేరుతుందని ఒప్పందంలో పేర్కొన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.1.23 కోట్లు తీసుకున్నారు. అలాగే తొలి పది నెలల కాలానికి ఎలాంటి అద్దె లేదని ఒప్పందం చేసుకున్నారు. కాగా, ఈ ప్రాపర్టీ స్థూల అద్దె ఆదాయం 4 నుంచి 5 శాతంగా ఉందని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది.

This website uses cookies.