మీరు మీ ఇంటి డెకర్ కోసం ఎంచుకునే రంగులు మీ వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు వెల్లడిస్తాయి. అందరిలాగే షామా సికిందర్ కూడా కచ్చితమైన ఇంటిని కలిగి ఉండాలని కోరుకుంటారు. అలాగే తరచుగా ఇంటిని ఆమె డెకరేషన్ చేసే తీరు ఆమెలోని భావాలను, వైఖరిని తెలియజేస్తుంది. తొమ్మిదేళ్ల క్రితం ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని తొలి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న షామా.. ప్రస్తుతం తన భర్తతో కలిసి సొంత అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. తరచుగా వివిధ ప్రాంతాలకు తిరిగే షామాతో రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆమె తన ఇంటికి సంబంధించి బోలెడు సంగతులు పంచుకున్నారు.
‘నా ఇంటి డిజైన్ నా భావాలను ప్రస్ఫుటింపచేయాలి. నేను ఎంచుకున్న రంగులు, శైలితో ఓ కథ అల్లేయాలి. నా ఇల్లు నాకు స్వర్గధామం కాబట్టి, అందులో నివసించే వ్యక్తులను అది ప్రతిబింబించాలి. నేను పెర్ ఫెక్షనిస్ట్ ని కాబట్టి, వస్తువులు లేదా డిజైన్ ను వీలైనంత పరిపూర్ణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను ఏదైనా ఎక్కవగా వెళుతుంటే మాత్రం ఎవరో ఒకరు నన్ను ఆపమని చెబుతారు. మినిమలిస్ట్, విలాసవంతం అనే రెండు ప్రపంచాల కలయికను నేను కోరుకుంటున్నాను’ అని వివరించారు.
అమీర్ ఖాన్ చిత్రం మన్ లో నటించిన ఈ భామ.. జీవితంలో వ్యవస్థీకృతంగా ఉండటానికి ఇష్టపడతారు. అప్పుడే కదా.. ఇల్లు శుభ్రంగా, విశాలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఎలాంటి చిందరవందరా ఉండదు. ఎక్కువ స్టోరేజీ, సరళమైన డిజైన్లతో ప్రశాంతంగా ఉండే గృహాలు వ్యక్తిగతంగా ఆమెను ప్రతిబింబిస్తాయి. ‘నాకు ఒక్క ఆస్తిపై కాకుండా అనేక ఆస్తులపై ఆసక్తి ఉంది. ఇది పెట్టుబడి. నా అవగాహన మేరకు ఓ పెంట్ హౌస్ ను సొంతం చేసుకోవడానికి మనహాటన్ స్కైలైన్ అనేది చాలా ఉత్తమ ప్రదేశం. దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. బీచ్ లో విల్లాలను సొంతం చేసుకోవాలని లేదా కర్ధాషియాన్లలా లాస్ ఏంజిల్స్ కొండలపై ఇల్లుండాలని అనుకోవడంలేదు. నేను లగ్జరీని ఎక్కువగా ఇష్టపడతాను. నాకు లగ్జరీ అంటే ఇష్టం. దానిని ఎవరు ఇష్టపడరు’ అని ప్రశ్నించారు.
షామా సికిందర్ ఇల్లు మొత్తం మొక్కలు, పూలతో నిండి ఉంటుంది. ఆమె ఇల్లు ఆమె జీవనశైలిని ప్రతిబింబించేలా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఉన్నప్పుడు రోజువారీ జీవితంలో ఆమె ఎలా భావిస్తుందో అలాగే ఉండాలి. ‘ఎందుకంటే ప్రకృతి మధ్యలో గడపడం నాకు చాలా ఇష్టం. నేను ప్రకృతితో మమేకమైన ప్రతిసారీ నిజంగా నేను ఎవరు? జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటో నాకు గుర్తుకువస్తుంది. ఇది నా ఇంట్లో కూడా తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ పని చేస్తాను. మన గ్రహం యొక్క అత్యంత అందమైన, వైద్యం చేసే భాగాలలో ప్రకృతి ఒకటి. జీవితం అనుకుంటున్నట్లుగానే జరుగుతోందని ఇది గుర్తుచేస్తుంది. ఇది ఎల్లప్పుడూ నేను ఎవరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఇక తెల్లవారుజామున కాఫీ లేదా టీ తాగితే చాలా బాగుంటుంది’ అని షామా పేర్కొన్నారు.
This website uses cookies.