భారత రియల్ ఎస్టేట్ రంగం జోరుగా దూసుకెళ్తోందని, ఇటీవల కాలంలో చక్కని అభివృద్ధి సాధించిందని ఎన్ఏఆర్ ఇండియా అధ్యక్షుడు అమిత్ చోప్రా తెలిపారు. 2050 నాటికి ఇది మరింతగా విస్తరిస్తుందని పేర్కొన్నారు.
2050 నాటికి భారత జీడీపీ 40 ట్రలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో అందులో రియల్ వాటా 15 శాతం నుంచి 20 శాతానికి చేరుతుందని అభిప్రాయపడ్డారు. అంటే ప్రస్తుతం ఉన్న వాటాతో పోలిస్తే.. వచ్చే 25 ఏళ్లలో రియల్ రంగం 2వేల శాతం వృద్ధి చెందుతుందని వివరించారు.