కరోనా తర్వాత ప్రపంచం చాలా మారింది. విశాలమైన ఇళ్లు, చుట్టూ పచ్చదనం, రణగొణ ధ్వనులకు దూరం.. ఇవే చాలామంది కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి ఇళ్లు కావాలంటే నగరానికి చాలా దూరంగా వెళ్లాల్సిందే. అప్పుడు ఆఫీసుకు రావాలంటే మళ్లీ ట్రాఫిక్ లో గంటల తరబడి ప్రయాణం చేయక తప్పదు. అదే విశాలమైన, చుట్టూ పచ్చదనంతో కూడిన, రణగొణ ధ్వనులకు దూరంగా నగరం నడిబొడ్డున ఇల్లు దొరికితే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ? ఈ అద్భుతాన్ని శోభా రియల్టీ కంపెనీ నిజం చేస్తోంది. హైదరాబాద్ సోమాజీగూడ రాజ్ భవన్ రోడ్డులో ‘శోభ వాటర్ ఫ్రంట్’ పేరుతో సరికొత్త ప్రాజెక్టును లాంచ్ చేస్తోంది.
మొత్తం నాలుగు ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మిస్తోంది. 2 బేస్ మెంట్లు, గ్రౌండ్, 15 అంతస్తులతో అద్భుతమైన డిజైన్ తో రూపుదిద్దుకోనున్న ఈ టవర్లలో 3, 3.5, 4 బీహెచ్ కే ప్రీమియం స్మార్ట్ హోమ్స్ లభిస్తాయి. 2100 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే, 2400 చదరపు అడుగుల్లో 3.5 బీహెచ్ కే, 3150 చదరపు అడుగుల్లో 4 బీహెచ్ కేలు ఉంటాయి. మొత్తం 238 యూనిట్లు.. అన్నీ ఈస్ట్ లేదా వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటాయి. ఎలైట్ యూనిట్, ప్రైమ్ యూనిట్, స్టాండర్డ్ యూనిట్ అనే మూడు రకాల అపార్ట్ మెంట్లుగా విభజించారు. అపార్ట్ మెంట్ బేసిస్ ధర చదరపు అడుగుకు రూ.13,500 ఉంటుంది. ఇక డెవలప్ మెంట్ ఛార్జీలు చదరపు అడుగుకు రూ.533, మెయింటనెన్స్ చార్జీలు చదరపు అడుగుకు రూ.400, ఫ్లోర్ రైజ్ ధర చదరపు అడుగుకు రూ.25, ఎలైట్ యూనిట్ కు చదరపు అడుగుకు రూ.200, ప్రీమియం యూనిట్ కు చదరపు అడుగుకు రూ.100 ఛార్జీ ఉంటుంది. స్టాండర్డ్ యూనిట్ కు అదనపు చార్జీలు ఉండవు.
లొకేషన్ పరంగా సోమాజిగూడ తిరుగులేని ప్రాంతం. సరిగ్గా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నందున.. ఎక్కడి నుంచైనా ఇక్కడకు చాలా ఈజీగా రావొచ్చు. కారు, ఎంఎంటీఎస్, మెట్రో.. ఇలా అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయి. ప్రముఖ ఆస్పత్రులు, ఉత్తమ స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, ఎంటర్ టైన్ మెంట్ జోన్స్, ఐటీ సెక్టార్ ఇలా అన్నీ ఇక్కడే ఉన్నాయి. మెరిడియన్ స్కూల్, చైతన్య విద్యాలయ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నాలుగున్న కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, జేఎన్టీయూ కూడా నాలుగున్న కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఓయూ 9.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఇన్ఫో సిటీ పార్క్, మైండ్ స్పేస్, సైబర్ పెరల్ వంటివి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. యశోద, డెక్కన్, నిమ్స్ ఆస్పత్రులు అత్యంత సమీపంలో ఉండగా.. రెయిన్ బౌ చిల్డ్రన్స్ ఆస్పత్రి 5.7 కిలోమీటర్లు, అపోలో 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పలు ప్రముఖ మాల్స్ 3 కిలోమీటర్ల లోపే ఉన్నాయి.
This website uses cookies.