(కింగ్ జాన్సన్ కొయ్యడ) : హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలామంది కలలు కంటారు. కాకపోతే, అనూహ్యంగా పెరిగిన ధరల నేపథ్యంలో సామాన్యులు సొంతింటి కల సాకారం చేసుకోలేని దుస్థితి. ఈ అంశాన్ని గుర్తించిన సిగ్నేచర్ ఎవెన్యూస్ సంస్థ.. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెెం.3 చేరువలోని ఇస్నాపూర్లో.. సరికొత్త గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఇందులో నివసించేవారు.. ఓఆర్ఆర్ మీదుగా.. గచ్చిబౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక్కడ్నుంచి సంగారెడ్డికి వెళ్లాలన్నా ఇంతే వ్యవధి అవుతుంది.
ఇదొక్కటే కాకుండా.. ఇంకా ఈ లగ్జరీ ప్రాజెక్టు ప్రత్యేకతల్ని తెలుసుకుంటే మీరు ఎగిరి గంతేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్లాటును బుక్ చేస్తారు. ఆతర్వాత మీరే అంటారు.. సిగ్నేచర్ ఫోర్టియస్ కంటే మించిన ప్రాజెక్టు ఇస్నాపూర్ చుట్టుపక్కల్లేనే లేదని! అప్రిసియేషన్ అందుకోవాలని భావించేవారికి ఈ నిర్మాణాన్ని మీరే సజెస్ట్ చేస్తారు. మరి, ఈ సిగ్నేచర్ ఫోర్టియస్ గేటెడ్ కమ్యూనిటీ విశిష్ఠతలేమిటో ఒకసారి చూసేద్దామా..
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి కారణంగా రియల్ రంగానికి రెక్కలొచ్చేశాయి. కోకాపేట్ వేలం తర్వాత భూముల ధరలు అనూహ్యంగా అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఫ్లాటు కొనాలంటే ఎంతలేదన్నా కోటీ రూపాయలు పెట్టాల్సిందే. అంతెందుకు మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్ కొనాలన్నా ఇంచుమించు ఇంతే ఖర్చొస్తుంది.
పోనీ, అంతంత రేటు పెట్టి ఫ్లాటు కొన్నాక ప్రాజెక్టు నిర్ణీత గడువు లోపు పూర్తవుతుందా? అంటే సందేహమే అని చెప్పొచ్చు. కనీసం నాలుగైదేళ్లు పట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. అఫర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాలని కోరుకునేవారికి.. సిగ్నేచర్ ఫోర్టియస్‌ని మించిన ప్రాజెక్టు లేదని చెప్పొచ్చు.
హెచ్ఎండీఏ, రెరా అనుమతి గల సిగ్నేచర్ ఫోర్టియస్ ప్రాజెక్టును ఎలా చూసినా.. పూర్తిగా వాస్త సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నివసించేవారు భద్రత గురించి చింతించక్కర్లేదు. సీసీటీవీ కెమెరాల నిత్యపర్యవేక్షణలో.. ఇరవై నాలుగు గంటలు భద్రతా సిబ్బంది పహారా కాస్తుంది. ఇంటర్ కామ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల వీరు నివాసితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. హఠాత్తుగా కరెంటు కట్ అయితే ఎలా? అనే దిగులు అక్కర్లేదు. ఎందుకంటే, కామన్ ఏరియాలతో పాటు అపార్టుమెంట్లకూ పవర్ బ్యాకప్ జనరేటర్లను ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల కరెంటు లేకపోయినా, ఇందులో నివసించేవారికి మాత్రం విద్యుత్ సౌకర్యం ఉంటుంది.
సిగ్నేచర్ ఫోర్టియస్‌లో నివసించే ప్రతిఒక్కరూ తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అవసరమయ్యే విధంగా క్లబ్‌హౌజ్ ని తీర్చిదిద్దుతారు. ఈ ఎలివేషన్ చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. పాశ్చాత్య డిజైన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. దాదాపు 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ క్లబ్ ఫోర్టియస్‌లో దొరకని సదుపాయమంటూ ఏదీ లేదు. చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలూ.. ఇలా అందరి కోసం స్విమ్మింగ్ పూల్ (విత్ చేంజింగ్ రూమ్స్), మోడ్రన్ జిమ్, కేఫ్‌టీరియా, బ్యాంకెట్ హాల్, సిట్టింగ్ లాంజ్, ఫార్మసీ, ఏటీఎం, క్రెష్, గేమ్స్ రూమ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, సెలూన్, లైబ్రరీ వంటివన్ని పొందుపరుస్తారు. ఇందులో నివసించేవారు తీరిక వేళలో ఎంచక్కా టేబుల్ టెన్నిస్, స్నూకర్, క్యారమ్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు.
సిగ్నేచర్ ఫోర్టియస్ ప్రాజెక్టులో నివసించేవారికి స్కూళ్లు, కాలేజీలు చేరువలోనే ఉన్నాయి. ఇక్కడ్నుంచి గీతమ్ యూనివర్శిటీ వెళ్లాలంటే కేవలం ఆరు కిలోమీటర్లే. ఐఐటీ హైదరాబాద్ కూడా పది కిలోమీటర్లలోనే ఉంటుంది. అంటే 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చన్నమాట. అత్యవసరాల్లో సిటిజెన్స్ వంటి ఆస్పత్రులకు రాకపోకల్ని సాగించొచ్చు. ఇస్నాపూర్ నుంచి తొషిబా సంస్థ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫోర్టియస్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కామంటే చాలు.. ఇరవై నిమిషాల వ్యవధిలో ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ సంస్థలకు చేరుకోవచ్చు.
ఇంతే వ్యవధిలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లొచ్చు. ఇక్కడ్నుంచి దాదాపు నలభై ఐదు నిమిషాల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లొచ్చు. సంగారెడ్డి, సదాశివపేట్ వంటి ఏరియాల్లో ఉద్యోగాలు చేసే ప్రతిఒక్కరూ ఇక్కడ్నుంచి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు వంటివి సమీపంలోనే ఉండటం విశేషం.
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 చేరువలోని ఇస్నాపూర్‌లో జోరుగా నిర్మాణ పనుల్ని జరుపుకుంటున్న సిగ్నేచర్ ఫోర్టియస్‌లోనే ఎందుకు ఫ్లాట్ కొనుగోలు చేయాలి? ఏయే అంశాల్ని చూసి ఇందులో పెట్టుబడి పెట్టాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇందుకు అనేక కారణాలు చెప్పొచ్చు.
సిగ్నేచర్ ఫోర్టియస్
ఎక్కడ: ఇస్నాపూర్
ఓఆర్ఆర్ 3 ఎగ్జిట్ చేరువలో
హెచ్ఎండీఏ, రెరా తుది అనుమతి
విస్తీర్ణం: 5 ఎకరాలు
టవర్లు: 6
ఫ్లాట్ల సంఖ్య: 340
విస్తీర్ణం: 1210 చ.అ.
(ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ మాత్రమే)
పూర్తిగా వాస్తుకు అనుకూలం
బ్యాంకు రుణాలు లభ్యం
This website uses cookies.