Categories: TOP STORIES

బంజారాహిల్స్‌లో స్కైవాక్ ప్రాజెక్టు..

బంజారాహిల్స్ వంటి పోష్ లొకాల్టీలో ఫార్చ్యూన్ వ‌న్‌లో నివ‌సించే అదృష్టం కేవ‌లం కొద్దిమందికే ద‌క్కింది. ఫార్చ్యూన్ వ‌న్ ఎంతటి హై సెక్యూర్డ్ ప్రాంతంలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. తెలంగాణ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ఎదురుగా ఉండ‌టం వ‌ల్ల సెక్యూరిటీ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. పైగా, ఈ ప్రాజెక్టులోని టెర్ర‌స్ మేజ‌ర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, రెసిడెంట్స్ ఎంచ‌క్కా టెర్ర‌స్ మీద స్కై వాక్ చేసుకునే అవ‌కాశాన్ని ఈ సంస్థ క‌ల్పించింది.

ఒక‌వేళ ఎవ‌రైనా టెర్ర‌స్ మీద వ‌ద్ద‌నుకుంటే.. అలా న‌డుచుకుంటూ కేబీఆర్ పార్కుకు కూడా వెళ్లిపోవ‌చ్చు. ఇక్క‌డ్నుంచి స్టార్ హోట‌ళ్లు, రెస్టారెంట్లు, టాప్‌ స్కూళ్లు, వ‌ర‌ల్డ్ క్లాస్ హాస్పిట‌ల్స్‌, ప‌బ్బులు, క్ల‌బ్బులు, కార్పొరేట్ ఆఫీసులు.. ఇలా ప్ర‌తిఒక్క‌టీ ఈ ప్రాజెక్టుకు చేరువ‌లో ఉండ‌టం విశేషం. మొత్తానికి, బంజారాహిల్స్ నడిబొడ్డున, ఫార్చ్యూన్ వన్ అత్యంత ఉన్నతంగా నిలిచే ఐకానిక్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి.

This website uses cookies.