అతను ఒక రియల్ సంస్థకు సీఈవో.. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో ఉన్నాడు. మరి, అలాంటి వ్యక్తి.. ఒక మేనేజర్‌ను ఒక గదిలో నిర్భంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశాడు. సడెన్‌గా బంజారాహిల్స్ పోలీసులు ఆ మేనేజర్‌ను రక్షించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే, సదరు మేనేజర్‌ను ఎంత చిత్రహింసలకు గురి చేసేవారో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. మరి, సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తి.. నేరుగా ఇలా దాడి చేయడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ విషయం మీడియాకి లీక్ అవ్వడంతో.. చివరి నిమిషంలో తేరుకున్న సుచిరిండియా సంస్థ.. పత్రికాముఖంగా ఒక వివరణను విడుదల చేసింది. ఇంతకీ స్టోరీలో ఏం జరిగిందంటే..
ప్రియాంక్ అనే వ్యక్తి రెండు నెలలుగా సుచిర్ ఇండియాలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కంపెనీ లెక్కల్లో రూ 5 లక్షలు తేడా రావడంతో నందీనగర్ లోని తన ఆఫీసుకు ప్రియాంక్ ని పిలిచి.. 5 లక్షలు ఏమయ్యాయి అంటూ దాడి చేయడమే కాకుండా ఒక గదిలో కూడా నిర్బంధించాడు. కిరణ్ బయటకు వెళ్లిన సమయంలో డయల్ 100 కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడిని బంజారాహిల్స్ పోలీసులు రక్షించారు. అనంతరం ప్రియాంక్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రియాంక్‌ను బెదిరిద్దామనుకుంటే.. హఠాత్తుగా పోలీసులు రంగప్రవేశం చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఏం చేయాలో అర్థం కాక.. ఇందులో తమ తప్పేం లేదని సుచిరిండియా సంస్థ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, తమకున్న పలుకుబడిని ఉపయోగించి.. అటు పోలీసుల్ని.. కొంతమేరకు మీడియాను.. ఈ సంస్థ మేనేజ్ చేసిందనే చెప్పాలి. మరి, ఈ కేసులో పోలీసులు బాధితుడికి ఎంతమేరకు న్యాయం చేస్తారో?
This website uses cookies.