Categories: TOP STORIES

టీసీఎస్ ఆఫీస్ అద్దె రూ.4.3 కోట్లు

హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్న సంస్థ

హైదరాబాద్ లో భారీ వాణిజ్య లావాదేవీ చోటు చేసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 10 లక్షల మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలకు రూ.4.3 కోట్ల అద్దెకు లీజుకు తీసుకుంది. 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు ఒప్పంద పత్రాల ద్వారా తెలుస్తోంది.

రాజపుష్ప అసెట్ మేనేజ్ మెంట్ ఎల్ఎల్ పీ, పారాడిగ్మ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన భవనంలో ఈ ఆఫీస్ స్థలం ఉంది. గ్రౌండ్ నుంచి 18 అంతస్తుల వరకు మొత్తం 19 అంతస్తులను టీసీఎస్ లీజుకు తీసుకుంది. మొత్తం 15 ఏళ్ల కాలానికి ఏడాదికి రూ.52.44 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఏటా అద్దెలో 12 శాతం పెరుగుదల ఉంటుంది. ఈ ఒప్పందం కోసం ఆరు నెలల అద్దె రూ.26.2 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్ గా టీసీఎస్ చెల్లించింది.

ఈ లీజు లావాదేవీకి ఐదేళ్ల లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. అలాగే లీజు ప్రారంభ తేదీ నుంచి మొదటి 11 నెలలు అద్దెరహితం అని ఒప్పందంలో పేర్కొన్నారు. అలాగే లీజు ఒప్పందంలో భాగంగా టీసీఎస్ కు మొత్తం 1018 కార్ పార్కింగ్‌లు (806 సాంప్రదాయ పార్కింగ్‌లు, 212 మెకనైజ్డ్ స్టాక్ పార్కింగ్ స్లాట్‌లు), 452 ద్విచక్ర వాహన పార్కింగ్ స్లాట్‌లు వస్తాయి. కాగా, ఆఫీస్ లీజింగ్ లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. 2025 క్యూ1లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను మధ్యస్త కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. Technology companies, Global Capability Centers (GCC) టెక్నాలజీ కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి బలమైన డిమాండ్ కారణంగా నగరంలోని ఆఫీస్ స్పేస్ స్టాక్ 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగులను దాటుతుందని అంచనా.

This website uses cookies.