-
మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో తెలిపారు. అంతేకాకుండా 22.5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ఇండస్ట్రియల్ పార్కులు, పారదర్శక పాలన, టీఎస్-ఐపాస్, సీఎం కేసీఆర్ దార్శనికత వంటి అంశాలు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి దోహదపడ్డాయని వివరించారు.
‘విజయపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ.. 2014 నుంచి టీఎస్ఐపాస్, ఐటీ రంగాల్లో రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, మైనింగ్, లాజిస్టిక్స్, ఇతర రంగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పెట్టుబడులు, ఉపాధి గణాంకాలు ఇంకా ఎక్కువే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలను కల్పించడం అగ్రస్థానంలో ఉన్న నగరాలను హైదరాబాద్ అధిగమించిందని తెలిపారు. మొత్తం 14 కీలక రంగాలను తమ ప్రభుత్వం గుర్తించిందని.. ప్రతి రంగానికీ ఓ డైరెక్టర్ ను నియమించామని చెప్పారు.