poulomi avante poulomi avante

అక్ర‌మ లేఅవుట్లకు స‌ర్కార్ ద్వారాలు?

ప్ర‌జాప్ర‌తినిధుల‌కు త‌లొగ్గి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌మ లేఅవుట్ల‌కు మళ్లీ ద్వారాలు తెరుస్తున్న‌దా? అంటే ఔన‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఆరంభమైన లేఅవుట్ల‌లో అమ్మకాలు జరిగిన ప్లాట్ల లావాదేవీలను జరుపుకునే వీలును రిజిస్ట్రేషన్ శాఖ కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తేందని సమాచారం. ఇది అమల్లోకి వస్తే.. ఒక ప్లాటు అక్రమమా? సక్రమమా? అని రిజిస్ట్రేషన్ సమయంలో తేల్చెదెవరు? కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన అక్రమ ప్లాట్లను సక్రమం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం నియంత్రించగల్గుతుందా?

రాష్ట్రంలో చాలామంది రియ‌ల్ట‌ర్ల‌కు పంచాయతీ అనుమతితో లేఅవుట్ల‌ అమ్మే అల‌వాటు ఉంది. ఒక రియ‌ల్ట‌ర్ ఎప్పుడో ప‌ది, ఇర‌వై ఏళ్ల క్రితం లేఅవుట్ వేయ‌డంవ‌ల్ల అందులో యాభై శాతం ప్లాట్లు అమ్ముడ‌య్యాయ‌ని అనుకుందాం. ప్ర‌స్తుతం నిబంధ‌న‌ల ప్ర‌కారమైతే.. అక్ర‌మ లేఅవుట్ల‌లో ప్లాట్ల‌ను ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి. కానీ, రిజిస్ట్రేష‌న్ శాఖ కొత్త విధానాన్ని ప్ర‌తిపాదిస్తున్న‌ది. అదేమిటంటే.. ఒక లేఅవుటులో ఇప్ప‌టికే ప్లాట్లు అమ్ముడ‌య్యి.. చేతులు మారితే గ‌న‌క‌.. ఎల్ఆర్ఎస్ లేక‌పోయినా వాటి లావాదేవీలను జ‌రిపేందుకు అనుమ‌తినిచ్చేందుకు సానుకూల‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ‌, ఇదే జ‌రిగితే గ‌న‌క‌.. పాత ప్లాట్ల పేరిట అక్ర‌మ లావాదేవీలు జ‌రిగేందుకు ఆస్కారం ఉంది.

ఎలా అంటారా?

ఎప్పుడో ఇర‌వై, ముప్ప‌య్ ఏళ్ల క్రితం వేసిన వెంచ‌ర్లో.. 60 శాతం ప్లాట్లు అమ్ముడ‌య్యాయ‌ని అనుకుందాం. మిగ‌తా న‌ల‌భై శాతం ప్లాట్ల‌ను రిజిస్ట‌ర్ చేయ‌డానికి వీల్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ అర‌వై శాతం ప్లాట్ల క్ర‌య‌విక్ర‌యాల‌కు అనుమ‌తిస్తుంద‌ని అనుకుందాం.. ఇదే జ‌రిగితే గ‌న‌క రియ‌ల్ట‌ర్లు ఏం చేస్తారంటే.. పాత తేదీలతో అనుమ‌తి తీసుకుని.. అదే లేఅవుట్‌లో మిగిలిపోయిన ప్లాట్ల‌ను కొత్త‌గా అమ్ముకునే వీలుంటుంది. దీని వ‌ల్ల అంతిమంగా మ‌ళ్లీ కొనుగోలుదారులు మోస‌పోయే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి, ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే ముందు స‌ర్కార్ పున‌రాలోచిస్తే మంచిదని అధిక శాతం రియల్టర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎవరు నియంత్రిస్తారు? (బాక్స్)

పాత లేఅవుట్లలో లావాదేవీలు జరిగిన ప్లాట్లను విక్రయించే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని అనుకుందాం. అయితే, అప్పటికే అమ్ముడైన ప్లాట్లు కాకుండా.. కొత్త ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తే.. వాటికి అడ్డుకట్ట వేసేదెవరు? ఆయా లేఅవుట్లను నియంత్రించేది ఎవరు? అలాంటి యంత్రాంగం లేకపోతే అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడే అవకాశమే ఉండదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles