హైదరాబాద్ వెస్ట్లో తెల్లాపూర్ శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ఐటీహబ్ పక్కన, ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉండటం, మౌలిక వసతులు ఏర్పాటుతో తెల్లాపూర్ రెసిడెన్షియల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ ఆకాశాన్ని తాకే స్కై స్క్రేపర్స్ తో పాటు విల్లా ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా జరుగుతోంది. ప్రీమియం అపార్ట్ మెంట్స్ తోపాటు అందరికి అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ లభిస్తుండటంతో అంతా తెల్లాపూర్ వైపు చూస్తున్నారు. మరి, తెల్లాపూర్ లో ఏయే నిర్మాణ సంస్థలు నివాస ప్రాజెక్టులు చేపట్టాయో తెలుసుకుందామా..
హైదరాబాద్ లో నివాస ప్రాజెక్టులకు మంచి ఆదరణ కనిపిస్తోంది. అందులోను ఐటీ హబ్ పరిసరాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆ తరువాత ఐటీ హబ్ ను ఆనుకుని తెల్లాపూర్ లో ఇంటి కొనుగోలుకు ఐటీ, ఫార్మా రంగ ఉద్యోగులు ఇష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగా తెల్లాపూర్ పరిసర ప్రాంతంలో నివాస అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణంపై రియాల్టీ కంపెనీలు దృష్టి సారించాయి. ఐటీ హబ్, బ్యాంకింగ్ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు దగ్గరగా ఉండటం తెల్లాపూర్ కు కలిసి వస్తోంది. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం, విద్యా, వైద్యం, వినోద సౌకర్యాలు అందుబాటులో ఉండటం అందరిని తెల్లాపూర్ వైపు చూసేలా చేస్తోంది. సిటీకి కాస్త అవతల ఉండి, ప్రశాంత వాతావరణం ఉండటం కూడా తెల్లాపూర్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఇక్కడి నుంచి మాదాపూర్ కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 45 నిమిషాల్లో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 30 నిమిషాల్లో తెల్లాపూర్ కు చేరుకోవచ్చు. ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీ కావడంతో ఇక్కడ అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తెల్లాపూర్ పరిసర ప్రాంతంలో భారీ ఎత్తున రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. తెల్లాపూర్ లో అపార్ట్ మెంట్స్ అందుబాటు ధరల్లో ఉండటంతో ఐటీ ఉద్యోగులతో పాటు, మధ్యతరగతి వారు కూడా ఇక్కడ ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదరపు అడుక్కీ 6 వేల రూపాయల నుంచి మొదలవుతుండగా, ప్రాజెక్ట్ ను బట్టి 12 వేల రూపాయల వరకు ధరలు ఉన్నాయి. తెల్లాపూర్ లో డబుల్ బెడ్‌రూం అపార్ట్ మెంట్ 90 లక్షల నుంచి మొదలు 3 కోట్ల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక విల్లాలైతే 4 కోట్ల రూపాయల నుంచి మొదలు 12 కోట్ల రూపాయల వరకు చెబుతున్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో తెల్లాపూర్ భారీ రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌గా మారనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెల్లాపూర్లోమై హోమ్ సంస్థ మై హోమ్ సయూక్ పేరుతో చేపట్టిన భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును పూర్తి కావస్తోంది. తాజాగా మై హోమ్ అక్రిద పేరుతో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. సుమారు 25 ఎకరాల్లో 12 హైరైజ్ టవర్లను నిర్మిస్తున్నారు. తెల్లాపూర్ లో ప్రముఖ రియల్టీ సంస్థ సుపధ డెవలపర్స్ సుపధ గమ్య పేరుతో ప్రీమియం అపార్టుమెంట్స్ నిర్మాణం చేపట్టింది. 10.12 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్లలో మొత్తం..1008 ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. ట్రిపుల్, ఫోర్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులోకి వస్తుండగా ధర 2.3 కోట్ల నుంచి మొదలవుతోంది. తెల్లాపుర్ లోని ఉస్మాన్ నగర్ రోడ్డులో విజన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ విజన్ అర్షా పేరుతో నిర్మిస్తున్న అపార్టుమెంట్ ప్రాజెక్టులో అందుబాటు ధరలో ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. మొత్తం11 ఎకరాల్లో 7 బ్లాకుల్లో 1561 ఫ్లాట్లను నిర్మిస్తోంది. 2, 3, 3.5 బెడ్రూం ఫ్లాట్స్ కార్పెట్ ఏరియా 973 చదరపు అడుగుల నుంచి మొదలు 1649 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1.35 కోట్ల ప్రారంభ ధర నుంచి లభ్యమవుతున్నాయి.
తెల్లాపూర్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు చేపట్టిన ఇలాంటి ప్రతిష్టాత్మకమైన నివాస ప్రాజెక్టులు సుమారు 35 వరకు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇవన్నీ యేడాది నుంచి మూడేళ్ల కాలంలోపూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణం, ఎమినిటీస్, నిర్మాణం పూర్తయ్యే సమయాన్ని బట్టి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ ధరలున్నాయి. మీరు మీ బడ్జెట్ ను బట్టి, ఇల్లు కావాల్సిన సమయాన్ని బట్టి ప్రాజెక్టును ఎంచుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని రియల్ రంగ మార్కెటింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
This website uses cookies.