Categories: TOP STORIES

యూడీఎస్‌, ప్రీలాంచుల‌పై ప‌ది శాతం జ‌రిమానా..

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సీరియ‌స్‌

యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టుల‌పై ప‌ది శాతం జ‌రిమానా విధిస్తామ‌ని తెలంగాణ రెరా అథారిటీ ఛైర్మ‌స్ సోమేష్ కుమార్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌మోట‌ర్లు, బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు యూడీఎస్ కింద ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. త‌గ్గింపు ధ‌ర‌కు విక్ర‌యిస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నార‌ని.. మార్కెటింగ్‌తో పాటు విక్ర‌యాలు చేస్తున్న‌ట్లు రెరా దృష్టికి వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ రెరా చ‌ట్టం ప్ర‌కారం..

ముంద‌స్తుగా రెరాలో రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌ని ప్రాజెక్టుల్లో యూడీఎస్ కింద భూవిక్ర‌యాలు చేస్తే ప్రాజెక్టు విలువ‌లో సుమారు ప‌ది శాతం జ‌రిమానా విధిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అట్టి విక్ర‌యాలు జ‌రిపే ప్ర‌మోట‌ర్లు, బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. రెరా చ‌ట్టం ప్ర‌కారం.. రెరాలో రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌ని ప్రాజెక్టుల్లోప్లాట్లు, స్థ‌లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

This website uses cookies.