కూకట్ పల్లి ఐడీఎల్ వివాదాస్పద భూములకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఛారిత్రాత్మక తీర్పునిచ్చన విషయం తెలిసిందే. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠంవే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉదాసిన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ (ఐడీయల్ కెమికల్స్) కేసులో మంగళవారం (సెప్టెంబర్ 13) తీర్పు వెలువరించింది. అయితే, వాసవి సంస్థ కొనుగోలు చేసిన భూములు ఇవేనా అని చాలామందికి సందేహం కలిగింది. కాకపోతే, రెండు భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయని సమాచారం.
హైదరాబాద్ నడిబొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠంవే. అయితే బఫర్ జోన్ లో ఉన్న ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని సవాలు చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారించిన ట్రిబ్యునల్ 2011 సంవత్సరంలో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ కు ఇచ్చిన లీజును రద్దు చేసింది.
ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. 2013 లో ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2013 లో స్టేటస్ కో మేయింటెన్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మంగళవారం పిటిషన్ విచారణకు రాగా.. గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ దాఖలు చేసిన పిటిష్‌న్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
This website uses cookies.