Categories: Celebrity Homes

రామాయ‌ణ్ వ‌దిలి వెళ్ల‌ను

  • బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా
    క‌ల‌ల గృహం ముచ్చ‌ట్లు..

నటి సోనాక్షి సిన్హా ఇల్లు రామాయణ్ జుహులో పై అంతస్తు మొత్తం ప్రత్యేకంగా ఆమె కోసమే అలంకరించారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇంట్లో ఇల్లు అన్నమాట. దీనిని అందంగా అలంకరించిన ఇంటీరియర్ డిజైనర్ రూపిన్ సుచక్ కు కూడా ఇది ఎంతో ప్రత్యేకమైనది. సోనాక్షి కోసం అలా అలంకరించడం తనకు ఎంతో ఇష్టమని రూపిన్ చెబుతారు. సోనాక్షి వ్యక్తిత్వానికి తగినట్టుగా కళాత్మక రంగులు, ఇతరత్రా వస్తువులు అలంకరణలో వినియోగించినట్టు వెల్లడించారు.

‘రామాయణ్ లోని ఈ అంతస్తు సోనాక్షి ఆమె ఇష్టాలను, నా సున్నితత్వాలను ఇంకా సౌందర్య భావాలను వెదజల్లుతుంది. ఇంట్లోనే సమయాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తిగా, అందంగా అలంకరించిన ఈ ఇల్లు చక్కని వెలుతురుతో నిండి ఉంటుంది. నేను ఎప్పుడూ ఈ ఇంటిని వదిలి వెళ్లకూడదని కోరుకునేలా చేస్తుంది’ అని వివరించారు. లివింగ్ రూమ్ లో స్లైడింగ్ గ్లాస్ డోర్, ప్రకాశవంతమైన గులాబీ, పసుపు రంగు గ్లాస్ ప్యానెల్ తో డిజైన్ చేసి ఉంటుంది. లివింగ్ ఏరియాకు మరింత ఆకర్షణ తెచ్చేందుకు పాప్ ఆర్ట్, అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. నియాన్ లైట్, అందమైన కిటికీ, చక్కని బల్లలు రెట్రో లుక్ తీసుకొచ్చాయి. ఇక బెడ్ రూమ్ లో చదువుకోవడానికి వీలైన రీడింగ్ నూక్ ను ముదరు రంగుల ప్యాలెట్ తో అదిరిపోయేలా డిజైన్ చేశారు.

 

‘నాకు ఎల్లప్పుడూ సొంత, గోప్యతగా ఉండే గది ఉండాలి. మొత్తం అంతస్తును నా కోసం ఏర్పాటు చేసుకున్న అనుభవం ఇదే మొదటిది. లాక్ డౌన్ సమయంలో వెబ్ సైట్లను పరిశోధించి అపార్ట్ మెంట్ ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన అవగాహనకు వచ్చాను. తర్వాత సుచక్ రావడంతో నేను కోరుకున్న ప్రపంచం నా కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఇది మొత్తం పూర్తయిన తర్వాత ఇంట్లోకి వెళ్లినప్పుడు చాలాకాలంగా అందులో నివసించినట్టు అనిపించింది’ అని సోనాక్షి తెలిపారు. ఆమెకు రామాయణ్ నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదు. ఈ కొత్త ప్రాపర్టీ కేవలం పెట్టుబడి మాత్రమేనని, దాని కోసం తాను కృషి చేస్తున్న కల అని చెప్పారు.

This website uses cookies.