దాదాపు 700 ఏళ్ల నుంచి ఉన్న ఓ ఎస్టేట్ ను రూ.225 కోట్లకు అమ్మకానికి ఉంది. హెలిప్యాడ్, క్రికెట్ పిచ్ సహా బోలెడు సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఎక్కడ అంటారా? యూకేలోని నార్త్ యార్క్ షైర్ లో. ఇంగిల్బీ కుటుంబానికి చెందిన రిప్లి కాజిల్ ను రూ.225 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఈ ధరకు విక్రయిస్తే.. లండన్ వెలుపల ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన ప్రాపర్టీల్లో ఇది ఒకటి అవుతుంది. ఆకట్టుకునే 445 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఎస్టేట్‌లో సుందరమైన సరస్సు, పబ్, హెలిప్యాడ్. విశాలమైన పార్కింగ్ ఉన్నాయి.
ప్రాపర్టీని తొమ్మిది లాట్లుగా విభజించారు. వీటిని వ్యక్తిగతంగా లేదా మొత్తంగా కొనుగోలు చేయవచ్చు. ఈ విశాలమైన ఎస్టేట్‌లో క్రికెట్ పిచ్, హోటల్, టీ రూమ్, గిఫ్ట్ షాప్, వివాహ వేదిక కూడా ఉన్నాయి. దీంతో ఇది అత్యంత ఆకర్షణీయమైన ప్రాపర్టీగా మారింది. ప్రస్తుత యజమాని సర్ థామస్ ఇంగిల్బీ.. తన భార్య లేడీ ఇంగిల్బీతో పాటు దశాబ్దాలుగా దీనిని నిర్వహిస్తున్నారు. 50 ఏళ్లుగా ఇందులోనే ఉంటున్న ఆయన.. తనకు చేయాల్సిన పనులు చాలా ఉండటంతో దీనిని అమ్మకానికి పెట్టినట్టు చెప్పారు.
This website uses cookies.