ఫెస్టివల్ సీజన్ వస్తే చాలు హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎక్కడ్లేని సందడి నెలకొంటుంది. వినాయక చవితి నుంచి ఆరంభమయ్యే ఇళ్ల అమ్మకాలు దసరా నుంచి ఊపందుకుంటాయి. కానీ, హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల సందడి లేదు.. ప్రాజెక్టు సందర్శనల కళకళ లేదు.. మార్కెట్ మొత్తం కళావిహీనంగా తయారైంది. అసలెప్పుడూ ఇలాంటి దుస్థితి మార్కెట్‌లో నెలకొనలేదని డెవలపర్లు అంటున్నారు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలోనూ అమ్మకాలు ఆశించినంత స్థాయిలోనే జరిగాయని.. ఇప్పుడు మాత్రం మార్కెట్ మొత్తం ఢమాల్ అయ్యిందని.. మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే టాప్ సిటీగా అవతరించిన భాగ్యనగరం కనీసం టాప్ టెన్ రేసులో లేకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణ రియాల్టీ కేవలం ఒకే ఒక్క గేరులో పని చేస్తోంది. మరి, టాప్ గేరులోకి ఎప్పుడు వెళుతుందా అంటూ నిర్మాణ రంగమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
This website uses cookies.