Categories: LATEST UPDATES

భూముల విలువ పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

  • ఏపీ ప్రభుత్వానికి నరెడ్కో వినతి

ఏపీలో జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) విజయవాడ చాప్టర్ విన్నవించింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి నరెడ్కో విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు బి.అమర్ నాథ్, ప్రధాన కార్యదర్శి జి. హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో భూముల మార్కెట్ విలువ పెంచడం వల్ల లక్షలాది మంది రియల్టర్లు, బిల్డర్లు, సామాన్యులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకుని రియల్ రంగాన్ని ఆదుకోవాలని కోరారు.

This website uses cookies.