హైదరాబాద్ లో ప్రజలు కర్టెన్లకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, ఇది క్రమంగా పెరుగుతుందే కానీ తగ్గడంలేదని డెకర్ వరల్డ్ కు చెందిన అంకిత్ గోయెల్ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా సేవలందిస్తున్న డెకర్ వరల్డ్.. కొత్తగా డెకర్ వరల్డ్ సెలక్ట్ అనే కర్టెన్ల వినూత్న కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది హై ఎండ్ ఫర్నింగ్ ష్టోర్. కర్టెన్లలో ఉత్తమమైనవి ఇక్కడ దొరుకుతాయి. ఈనెల 15న బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లో ఈ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియన్స్ సెంటర్ సేవలు పొందాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం ఆ సమయంలో మీ ఆర్కిటెక్ట్ లేదా డిజైనర్ తో కలిసి స్టోర్ సందర్శించాలి. అక్కడున్న ఎన్నో రకాల కర్టెన్లను స్వయంగా పరిశీలించి, అనుభూతి చెంది, నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికత సహాయంతో ఆ కర్టెన్లు మీ ఇంట్లో ఎలా కనిపిస్తాయో కూడా చూడొచ్చు.
రూ.కోటికి పైగా వెచ్చించి రూపొందించిన ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్లో ఒకరికి కేటాయించిన టైమ్ స్లాట్ లో ఎవరినీ అనుమతించరు. అందువల్ల ఎలాంటి సమస్యలూ లేకుండా నచ్చిన కర్టెన్లు ఎంచుకోవచ్చని హైదరాబాద్ లోని టాప్ ఐదుగురు ఫర్నిషింగ్ నిపుణుల్లో ఒకరైన అంకిత్ వెల్లడించారు. హోమ్ డెకర్ లో కర్టెన్ల పాత్ర కీలకంగా మారిందని వెల్లడించారు . కర్టెన్ల కోసం ప్రజలు భారీగానే వెచ్చిస్తున్నారని తెలిపారు. దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే 3 బీహెచ్ కే ఫ్లాట్ యజమాని ఒక్క కర్టెన్ల కోసమే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వెచ్చిస్తున్నారని చెప్పారు.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెంబర్ వన్ మ్యాట్రెస్ బ్రాండ్ ‘సెర్టా’ ప్రాంచైజీని ఆయన తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బ్రాండ్ కు అంకిత్ మాస్టర్ ప్రాంచైజీ. రాబోయే మూడేళ్లలో సెర్టాకు సంబంధించి మూడు స్టోర్లు ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు. దేశలో గృహోపకరణాల మార్కెట్ దాదాపు రూ.20వేల కోట్లకు చేరిందని వివరించారు. ఒక్క హైదరాబాద్ లో ఇది రూ.1000 కోట్లు కాగా.. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఇది రూ.500 కోట్లుగా ఉన్నట్టు అంచనా. పైగా ఇది ఏటా 25 శాతం పెరుగుతోంది
This website uses cookies.