దేశంలో రియల్ ఎస్టేట్ బలమైన డిమాండ్ ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రజలు మరో వెకేషన్ హోమ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సెకండ్ హోమ్ మార్కెట్ కూడా క్రమంగా వేగం పుంజుకుంటోంది. రియల్టీ సంస్థ ఆక్సాన్ నివేదిక ప్రకారం.. సెకండ్ హోమ్ కు సంబంధించి సిమ్లా, సింధు దుర్గ్, కూర్గ్ లు దేశంలోని టాప్ 10 గమ్యస్థానాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా డెహ్రాడూన్, ముస్సోరి, సిలిగురి, డార్జిలింగ్, నంది హిల్స్, పాండిచ్చేరి, చంబా అండ్ తెహ్రి బెల్ట్, రిషికేశ్ అండ్ హరిద్వార్ బెల్ట్, లోనావ్లా, మహాబలేశ్వర్ కూడా ఉన్నాయి. అందమైన పరిసరాలు, సుందరమైన సహజ ప్రకృతి దృశ్యాల మధ్య గేటెడ్ విల్లాలు, కాటేజీలు, ఫామ్ హౌస్ ల కోసం డిమాండ్ పెరుగుతోంది.
ఉత్తర భారతదేశంలో సిమ్లా (కసౌలీతోపాటు), ముస్సోరి అండ్ డెహ్రాడూన్, టెహ్రీ తదితర ప్రదేశాలు రెండో ఇంటికి సంబంధించిన అద్భుతమైన గమ్యస్థానాలు. అద్భుతమైన హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య సహజమైన పైన్ అడవులకు సమీపంలో ఒక ఇంటిని సొంతం చేసుకోవడం చాలా మందికి.. ముఖ్యంగా ఉత్తరప్రదే లో చాలా మందికి కల లాంటి విషయం. అలాగే హిమాలయాల దిగువ ప్రాంతంలో గంగానదితోపాటు నరేంద్ర నగర్, హరిద్వార్, రిషికేశ్ కూడా చాలామందికి కావాల్సిన గమ్యస్థానంగా ఉంది. పశ్చిమాన పెర్నెంలో మోపా విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత సింధు దుర్గ్, గోవా-మహారాష్ట్ర సరిహద్దులో విస్తరించి ఉన్న కొంకణ్ ప్రాంతం రహస్య రత్నంగా వెలుగొందుతోంది. దట్టమైన పచ్చటి అడవులు, ఉత్కంఠభరితమైన కొండలు, సహజ నీటి బుగ్గల వంటివి సింధు దుర్గ్ ను రెండో ఇల్లు, ఫామ్ హౌస్ లు, పర్యావరణ హోటళ్లు మొదలైనవి అభివృద్ధి చేయడానికి చక్కని ప్రదేశంగా మార్చాయి. ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి చాలా మంది క్యూ కడుతున్నారు. గత 12 నెలల్లోనే ప్రాపర్టీ ధరలు 24 నుంచి 32 శాతం మేర పెరిగాయి. సింధు దుర్గ్ మన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. డిమాండ్ పెరుగుతున్నందున అద్దె ఆదాయం 6.7 శాతం నుంచి 7.2 శాతం మధ్యలో ఉంది.
This website uses cookies.