దేశవ్యాప్తంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఓవైపు ధరలు పెరుగుతున్నప్పటికీ, విలాసవంతమైన గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. కోవిడ్ తర్వాత జనాల ఆలోచనలు, ఆకాంక్షల్లో వచ్చిన మార్పుల ఫలితంగా విశాలంగా ఉండే ఇళ్లనే కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 బీహెచ్ కే ఇళ్ల కంటే 3 బీహెచ్ కే ఇళ్లకే డిమాండ్ ఎక్కువైంది. అదే సమయంలో సౌకర్యవంతమైన ఇళ్లను ఎక్కువ మంది ఇష్టపడుతుండటంతో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగింది.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, ఆర్థిక వృద్ధి పెరగడం, ముఖ్యంగా యువజనాభాలో సౌకర్యవంతమైన ఇంటిని సొంతం చేసుకోవాలనే ఆకాంక్షలు పెరగడం వంటి కారణాలతో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘దేశంలో 2013-14 నుంచి 2019 వరకు హౌసింగ్ డిమాండ్ స్తబ్దుగా ఉండేది. ధరలు కూడా స్థిరంగానే ఉండేవి. అలాంటి సమయంలో ఏది పడితే యువత ఆలోచనలతో పరిస్థితులు మారాయి. ముఖ్యంగా ఏది పడితే అది సొంతం చేసుకోవడం వారికి ఇష్టం లేదు. అప్పట్లో ఎక్కువ మంది అద్దెకు ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇల్లు కొనాలనే భావన ఉండేది కాదు’ అని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా హెడ్ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. అయితే, కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ‘కరోనా తర్వాత సొంతింటి ప్రాముఖ్యత తెలిసింది. అంతేకాకుండా విశాలమైన, సౌకర్యవంతమైన ఇళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపించడం ప్రారంభించారు. పైగా ఆ సమయంలో వడ్డీ రేట్లు కూడా అత్యల్పంగా ఉండటంతో దేశంలో ఇళ్లకు డిమాండ్ పెరిగింది’ అని విశ్లేషించారు.
This website uses cookies.