రెజ్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో కొవిడ్ కంటే ముందు రియల్ సంస్థల కార్యాలయాలు కళకళలాడేవి. అటు కొనుగోలుదారులతో ఇటు ఏజెంట్లతో ఎప్పుడు చూసినా హడావిడిగా కనిపించేవి. సెకండ్ వేవ్ పూర్తయ్యిందని ప్రభుత్వం ప్రకటించినా రియల్ సంస్థలింకా బోసి పోయినట్లుగానే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నంత హడావిడి లేదు. సిబ్బంది కూడా పూర్తిగా తగ్గిపోయారు. మరి, కొవిడ్ వల్ల మన నిర్మాణ రంగం ఎంత దారుణంగా పతనమైందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అంతెందుకు నైట్ ఫ్రాంక్ కూడా తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది.
ర్యాంకు | మార్కెట్ | వార్షిక పద్ధతిలో |
1 | టర్కీ | 29.2 |
3 | అమెరికా | 18.6 |
7 | ఆస్ట్రేలియా | 16.4 |
8 | కెనడా | `6 |
10 | రష్యా | 14.4 |
12 | యూకే | 13.2 |
17 | జర్మనీ | 10.9 |
38 | బ్రెజిల్ | 4.8 |
40 | చైనా (మేన్ లాండ్) | 4.3 |
54 | ఇండియా | -0.5 |
ఈ పట్టికను గమనిస్తే.. టర్కీలో వార్షిక పద్ధతిలో ఇళ్ల ధరలు 29.2 శాతం అధికమయ్యాయి. అమెరికాలో 18.6 శాతం, జర్మనీలో 10.9 శాతం నమోదయ్యాయి. కానీ, మన దేశంలో మాత్రం మైనస్ 0.5 శాతం నమోదు కావడం దారుణమైన విషయం. హైదరాబాద్లోనూ గత త్రైమాసికంలో మైనస్ 0.3 శాతానికి పడిపోయింది.
This website uses cookies.