poulomi avante poulomi avante

టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆమ్యామ్యాలు మానేయాలి

  • అప్పుడే అనుమ‌తులు సులువు
  • టీఎస్‌బీపాస్ తెచ్చిన‌ప్పుడూ గొప్ప‌లే
  • కానీ, వాస్త‌వంలో జ‌రిగిందేమిటి?

ఇంట్లో కూర్చున్న చోట నుంచే ఇంటి నిర్మాణ అనుమ‌తి పొంద‌వ‌చ్చ‌ని.. ఇలాంటి మరిన్ని ప్రయోజనాలు నూతన నిర్మాణ అనుమతుల విధానం ‘బిల్డ్ నౌ’ తో ప్రజలకు చేరువ కానుంద‌ని పుర‌పాల‌క శాఖ అంటుంది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం టీఎస్‌బీపాస్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడూ ఇదే విధంగా గొప్ప‌లు చెప్పారు. 21 రోజుల్లోపు అనుమ‌తిని మంజూరు చేయ‌క‌పోతే, ఆయా అధికారుల‌పై జ‌రిమానా విధిస్తామ‌ని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.

కానీ, వాస్త‌వంగా జ‌రిగిందేమ‌టి? 21 రోజులు కాదు క‌దా.. రెండు నెల‌ల ప‌ది రోజులు దాటిన త‌ర్వాత కూడా అనుమ‌తులు వ‌చ్చేవి కాదు. అందుకే, ఎన్ని యాప్‌లు తెచ్చినా ప్ర‌యోజ‌నం ఉండ‌దని.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అధికారులు, సిబ్బంది ఆలోచ‌న విధానం మ‌ర‌నంత వ‌ర‌కూ ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది. కాసులు అందుకోనిదే టౌన్ ప్లాన్ సిబ్బంది.. అంత సులువుగా అనుమ‌తుల్ని మంజూరు చేయ‌రే చేయ‌ర‌ని జగ‌మెరిగిన స‌త్య‌మ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. కాక‌పోతే, బిల్ట్ నౌ ప‌నితీరు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని పుర‌పాల‌క శాఖ గొప్ప‌లు చెప్పుకుంటుంది. ఇంత‌కీ కొత్త టెక్నాల‌జీ ఎలా ప‌ని చేస్తుందంటే..

మొబైల్‌లోనే బిల్డ్ నౌ వెబ్‌సైటును ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి.. గరిష్ఠంగా 15 రోజుల్లోపు అనుమతి ఇస్తారని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇది ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ప‌ని చేస్తుంది. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే. దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదట జీహెచ్ఎంసీ పరిధిలో మార్చి 10 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు.

  •  భవన నిర్మాణానికి ఆర్కిటెక్ట్లు రూపొందించే డ్రాయింగే ప్రామాణికం. ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతుంది. అది కాస్తా నిమిషాల్లోకి త‌గ్గుతుంద‌ని అధికారులు అంటున్నారు.
  • జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ, తదితర శాఖలన్నీ బిల్డ్ నౌ తో అనుసంధానమై ఉంటాయి.
  • ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకోగానే.. అందుకు సంబంధించిన వివ‌రాల్ని పూర్తిగా న‌మోదు చేశారా? ఫైలు ఏ అధికారి వద్ద పెండింగులో ఉంది.. త‌దిత‌ర వివ‌రాల్ని ద‌ర‌ఖాస్తుదారుడు తెలుసుకోవ‌చ్చు.
  • సామాన్యుడు సైతం.. తనకున్న ఇంటి స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, సెట్ బ్యాక్ ఎంత వదలాలి, దరఖాస్తు విధానం గురించి వెబ్‌సైటులో వివ‌రాల్ని పొంద‌వ‌చ్చు. డ్రాయింగ్ ప్రకారం 3డీ ఇంటి నమూనాలను కూడా చూడొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. అనుమ‌తులు త్వ‌ర‌గా మంజూరు అయ్యేందుకు అధికారులు, సిబ్బంది ప‌ని చేయాలి క‌దా. వాళ్లేం చేస్తారంటే.. ఫ‌లానా ద‌ర‌ఖాస్తులో అది షార్ట్‌ఫాల్ ఉంది.. ఈ డాక్యుమెంట్ స‌మ‌ర్పించ‌లేదు.. అని ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తే ఏం చేస్తారు? పుర‌పాల‌క శాఖ ఎన్ని కొత్త టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టినా.. పుర‌పాల‌క శాఖ అధికారులు, సిబ్బంది ప‌నితీరు మార‌నంత వ‌ర‌కూ.. అనుమ‌తుల‌నేవి త్వ‌ర‌గా ల‌భించ‌నే ల‌భించ‌వ‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles