దేశంలో రియల్ ఎస్టేట్ అథార్టీ (రెరా) పనితీరు నిరాశాజనకంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొందరు ప్రైవేట్ బిల్డర్లు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనల సందర్భంగా మహిరా హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కె.పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ.. రెరా చట్టం అమలులో విఫలమైందని పేర్కొన్నారు. ఒకవేళ ప్రాజెక్టు విఫలమైతే.. అది చాలామందిపై ప్రభావం చూపిస్తుందని.. అందువల్ల దేశంలో రియల్ రంగం బలోపేతం చేయడానికి కోర్టుల జోక్యం అవసరమని నివేదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం వాటిని అంగీకరిస్తూ.. రెరా పనితీరు నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్యానించింది.