poulomi avante poulomi avante

కనీవినీ ఎరుగని రీతిలో ట్రిపుల్ ఆర్ ఇంటర్ చేంజర్స్

రీజినల్ రింగ్ రోడ్డు.. తెలంగాణకు మరో మణిహారం కోబోతోంది. రెండు ఫేజ్ లలో నిర్మించే 350 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ కు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించడంతో శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా నిర్మించే ఇంటర్ చేంజర్స్ ఈ ప్రాజెక్టుకే తలమానికం అని చెప్పాలి. ఒక్కో ఇంటర్ చేంజర్ 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండటంతో దేశంలోని మిగతా ఎక్స్ ప్రెస్ వే లకంటే రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. . ట్రిపుల్ ఆర్ కి సంబందించిన అలైన్‌మెంట్‌ సైతం ఖరారు కావడం, ఉత్తర భాగం రోడ్డుకు సంబందించిన భూసేకరణ పనులు పూర్తవ్వడం, కేంద్ర ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి.

రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తరభాగం నర్సాపూర్‌ నుంచి తూప్రాన్‌ -గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ వరకు 161.2 కిలో మీటర్లు ఉండగా, దక్షిణభాగం చౌటుప్పల్‌లో ప్రారంభమై ఆమనగల్‌-షాద్‌నగర్‌ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇంటర్ చేంజర్స్ వచ్చే 12 ప్రాంతాల్లో టౌన్ షిప్పుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. హైదరాబాద్ మాస్టల్ ప్లాన్ లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో మరీ ముఖ్యంగా ఇంటర్ చేంజర్స్ వచ్చే ప్రాంతాల్లో సాటిలైట్ టౌన్ షిప్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు కానున్న నేపధ్యంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు భారీగా రానున్నాయి. ఇంటర్ చేంజర్స్ వచ్చే మొత్తం 12 ప్రాంతాల్లో భారీ కూడళ్లను ఏర్పాటు చేసి టౌన్ షిప్ లతో పాటు ప్రైవేట్ రియాల్టీ సంస్థలు నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు

దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేలతో పోలిస్తే ట్రిపుల్ ఆర్ ప్రధాన కూడళ్లు భిన్నాంగా, భారీగా ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఔటర్‌ రింగురోడ్డులో భాగంగా నిర్మించిన క్లవర్‌ లీఫ్‌ ఇంటర్‌ చేంజర్స్ తో పోలిస్తే రీజినల్ రింగ్ రోడ్డు ప్రధాన కూడళ్లు మరింత భారీగా, ఆధునికంగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మితం కానున్నా, రానున్న రోజుల్లో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్‌ చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి.

ఒక్కో ఇంటర్ చేంజ్ సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో రీజినల్ రింగ్ రోడ్డు ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్‌ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ట్రిపుల్ ఆర్ పైకి వాహనదారులు రావడానికి, అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు క్లవర్‌ లీఫ్‌ ఇంటర్‌ చేంజర్స్ అవకాశం కల్పిస్తాయి. అంతే కాదు సర్వీసు రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్ చేంజెస్ నిర్మించనున్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం క్లవర్‌ లీఫ్‌ ఇంటర్‌ చేంజ్ స్ట్రక్చర్లు మొత్తం 12 ప్రాంతాల్లో రానున్నాయని తెలుస్తోంది. ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్‌.. గిర్మాపూర్‌ గ్రామాల మధ్య ఓ ఇంటర్ చేంజర్ నిర్మాణం కానుంది. నాందేడ్‌ రహదారిపై శివంపేట సమీపంలోని ఫసల్‌వాది సమీపంలో మరో ఇంటర్ చేంజర్ వస్తుంది. ఇక మెదక్‌ రోడ్డుపై రెడ్డిపల్లి..పెద్ద చింతకుంట మధ్య ఇంకో ఇంటర్ చేంజర్ ను నిర్మిస్తారు. నాగ్‌పూర్‌ రోడ్డుపై తూప్రాన్‌ సమీపంలోని మాసాయిపేట వద్ద నాలుగో ఇంటర్ చేంజర్ నిర్మాణం కానుంది. కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద ఆరో ఇంటర్ చేంజర్ వస్తుంది. వరంగల్‌ జాతీయ రహదారిపై భువనగిరి..

రాయ్‌గిరి మధ్య భువనగిరికి చేరువలో మరో ఇంటర్ చేంజర్ రానుంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ రోడ్డుపై మందాపురం.. పెనుమటివానిపురం మధ్య ఇంకో ఇంటర్ చేంజర్ ను నిర్మించబోతున్నారు. ఇక బెంగళూరు జాతీయ రహాదారిపై షాద్ నగర్ సమీపంలో బాలానగర్ దగ్గర మరో ఇంటర్ చేంజర్ రాబోతోంది. శ్రీశైలం రహదారిపై ఆమన్ గల్ కు రెండు కిలోమీటర్ల సమీపంలో భారీ ఇంటర్ చేంజర్ నిర్మాణం కానుంది.మరో మూడు ఇంటర్ చేంజర్స్ అలైన్ మెంట్స్ ను త్వరలోనే ఖరారు చేయనుంది నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా.

ఇలా రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మాణం కాబోతున్నాయి. ఇక యధావిధిగా ఈ 12 ఇంటర్ చేంజర్స్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మితం కానున్నాయని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో రానున్నో కొన్నేళ్లలో రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల రూపరేఖలే మారిపోనున్నాయని అంటున్నారు. గ్రేటర్ సిటీకి సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మధ్య తరగతి వారికి ఇది మంచి అవకాశమని సూచిస్తున్నారు. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ఇంటర్ చేంజర్స్ వచ్చే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మాణ ప్రాజెక్టులకు సన్నద్దమవుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles