జేఎల్ఎల్ చేస్తున్న ప్రీలాంచ్ అమ్మకాలపై రియల్ ఎస్టేట్ గురు ప్రచురించిన కథనంపై తెలంగాణ రాష్ట్ర రెరా ఛైర్మన్ డా. ఎన్ సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీలాంచ్ అమ్మకాల్ని చేపడుతున్నందుకు సోమవారం షోకాజ్ నోటీసును జారీ చేశారు. దీనిపై జేఎల్ఎల్ పదిహేను రోజుల్లోపు సంజాయిషీని రెరా అథారిటీకి సమర్పించాలని ఆదేశించారు. షాద్ నగర్ సమీపంలోని చెరుకుపల్లి, కొందుర్గ్ లో స్వర్గసీమ శాండిల్ వుడ్ పార్క్, స్వర్గసీమ సుకేతన పేరుతో నివాస ప్లాట్లు విక్రయించే వెంచర్ చేపట్టి.. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహించడంపై షోకాజ్ నోటీసునిచ్చింది. మహేశ్వరం, తుక్కాపూర్ గ్రామం, శ్రీనగర్ ప్రాంతాల్లో.. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ప్రాంతంలో కాన్‌స్టెల్లా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్ కలిగి ఉండి కూడా ప్రకటనల్లో.. రిజిస్ట్రేషన్ నెంబర్ చూపకుండా.. వెబ్‌సైటులో నమోదు చేయకపోవడం వల్ల షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ సందర్భంగా టీఎస్ రెరా ఛైర్మన్ డా. ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రెరా నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ప్రమోటర్ రెరా రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తప్పనిసరిగా పొందాలని తెలిపారు.
This website uses cookies.